శేషగిరిరావు పాడే మోసిన నామ నాగేశ్వరరావు

శేషగిరిరావు పాడే మోసిన నామ నాగేశ్వరరావు

0
TMedia (Telugu News) :

శేషగిరిరావు పాడే మోసిన నామ నాగేశ్వరరావు

mp,s nama, vaddiraju
mp,s nama, vaddiraju

టి మీడియా మే,16,తల్లాడ :మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు , డీసీఎంఎస్ జిల్లా మాజీ చైర్మన్ రాయల శేషగిరి రావు అంత్యక్రియలు గురు వారం ఆయన స్వగ్రామం మిట్టపల్లి లో జరగగా పార్టీ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఆయన భౌతిక దేహానికి పూల దండ వేసి, శ్రద్ధాంజలి ఘటించి, సంతాపం తెలిపి, ఘనంగా నివాలర్పించా రు. కుటుంబ సభ్యులను పలకరించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా అంతిమ యాత్ర లో కడ వరకు శేషగిరిరావు పాడే మోసి, తుది వీడ్కోలు పలికి, సానుభూతి తెలిపారు. దాదాపు రెండు కిలో మీటర్ల మేరకు పాడే మోసి, రాజకీయ మిత్రునికి కడసారి వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ నుంచి కూడా శేషగిరిరావు తో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పి, గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తుది వరకు ఆయన పార్టీకి ఎంతో సేవ చేశారని అన్నారు. రైతాంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పని చేసిన నాయకుడని కొనియాడారు. మంచి నాయకుడిని కోల్పోయామని పేర్కొన్నారు.

 aalsoread: డీఎంహెచ్‌ఓపై లైంగిక వేధింపుల కేసు

జిల్లా రాజకీయా ల్లో ఆయనది ప్రత్యేకమైన ఒరవడి అని , ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొ న్నారు. వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని నామ స్పష్టం చేశారు.వారి ఆత్మకు శాంతి కలగాలని నామ దైవాన్ని కోరుకున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube