శేషన్న మావోయిస్టుల్లోనూ పనిచేశాడు.   

శేషన్న మావోయిస్టుల్లోనూ పనిచేశాడు.   

1
TMedia (Telugu News) :

శేషన్న మావోయిస్టుల్లోనూ పనిచేశాడు.

 -అండర్‌గ్రౌండ్ ఆపరేషన్లకు చెక్

-6 హత్యలు, 3 బెదిరింపులకు పాల్పడ్డ కేసులు

టీ మీడియాబ్యూరో :నయీమ్ అనుచరుడు శేషన్నను పోలీసులు అరెస్టు చేశారు. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయిన శేషన్న.. అజ్ఞాతంలో ఉండి కొన్నేళ్లగా ల్యాండ్ సెటిల్‌మెంట్లు, అక్రమ దందాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. శేషన్నపై ఇప్పటివరకు 9 కేసులను గుర్తించామని వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డెవిస్ తెలిపారు. 6 హత్యలు, 3 బెదిరింపులకు పాల్పడ్డ కేసులను గుర్తించినట్లు వెల్లడించారు. శేషన్నను హుమయూన్‌నగర్‌లో ఆయుధాల కేసులో అరెస్టు చేసినట్లు తెలిపారు.గ్యాంగ్‌స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడు ముద్దునూరి శేషయ్య అలియాస్ శేషన్న (54)ను పోలీసులు అరెస్టు చేశారు. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయిన శేషన్న అజ్ఞాతంలో ఉండి కొన్నాళ్ల నుంచి ల్యాండ్ సెటిల్‌మెంట్లు, అక్రమ దందాలను చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. శేషన్నను అరెస్టు చేసినట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. శేషన్నపై ఇప్పటివరకు 9 కేసులను గుర్తించామని వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డెవిస్ తెలిపారు.

ALSO READ :అమెరికాలో తెలుగు వాళ్ళు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

హత్యలు, బెదిరింపులకు పాల్పడ్డ కేసులను గుర్తించినట్లు వెల్లడించారు. శేషన్నను హుమయూన్‌నగర్‌లో ఆయుధాల కేసులో అరెస్టు చేసినట్లు డీసీపీ జోయల్ డెవిస్ తెలిపారు.నానక్‌రామ్‌గూడ నుంచి గచ్చిబౌలి వెళుతున్న శేషన్నను గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1993లో శేషన్నను మొదటిసారి సనత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎస్ వ్యాస్ హత్య కేసులో శేషన్న నిందితుడిగా ఉన్నాడు. గ్యాంగ్‌స్టర్ నయీంతో కలిసి శేషన్న పలు నేరాలకు పాల్పడ్డాడు. నయీంతో కలిసి మావోయిస్టుల్లోనూ పనిచేశాడు. 15 మంది నక్సల్ కమాండర్స్‌తో పని చేశాడు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube