ఆ స్టార్ ఓటీటీ సంస్థకు ‘సీతారామం’ డిజిట‌ల్ హ‌క్కులు

ఆ స్టార్ ఓటీటీ సంస్థకు ‘సీతారామం’ డిజిట‌ల్ హ‌క్కులు

1
TMedia (Telugu News) :

ఆ స్టార్ ఓటీటీ సంస్థకు ‘సీతారామం’ డిజిట‌ల్ హ‌క్కులు
టీ మీడియా,ఆగస్టు 5, సినిమా: ‘ఓకే బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ్యాడు దుల్క‌ర్ స‌ల్మాన్‌. ఆ త‌ర్వాత ‘మ‌హాన‌టి’తో నేరుగా తెలుగులోనే న‌టించి టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. కాగా ఈయ‌న న‌టించిన లేటెస్ట్ మూవీ ‘సీతారామం’ నేడు విడుద‌లై పాజిటీవ్ రివ్యూల‌ను తెచ్చుకుంది. హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంపై మొద‌టి నుండి ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. థియేట‌ర్‌కు వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌ను ఈ చిత్రం పూర్తిగా సంతృప్తి ప‌రిచిందిని సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ మేజ‌ర్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

 

Also Read : సోనియా, రాహుల్‌, ప్రియాంకా.. న‌లుపు దుస్తుల్లో నిర‌స‌న‌

‘సీతారామం’ చిత్ర డిజిట‌ల్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ద‌క్కించుకుంది. థియేట‌ర్ విడుద‌ల‌కు ఆరు వారాల త‌ర్వాత ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో దుల్క‌ర్ లెఫ్టినెంట్ రామ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. మృనాళ్ థాకూర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కథ‌ను మ‌లుపు తిప్పే పాత్ర‌లో న‌టించింది. న‌టుడు సుమంత్, త‌రుణ్ భాస్క‌ర్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రాన్ని స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై స్వ‌ప్న ద‌త్ నిర్మించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube