టీ మీడియా, నవంబర్02, మధిర:
మధిర మండలం మాటూర్ ఉన్నత పాఠశాల హిందీ పండిట్ శ్రీమతి చాంద్ బేగం చొరవతో మధిర పట్టణానికి చెందిన హరే రామ హరే కృష్ణ నారాయణస్వామి సేవా ట్రస్ట్, శ్రీ ధ్యాన చక్ర హీలింగ్ పీఠం సభ్యులు ఆధ్వర్యంలో కుట్లు అల్లికలు సంబంధించిన కుట్టు మిషన్,అల్లికల సామాగ్రి,దారాలు, సూదులు కత్తెర, ఎంబ్రాయిడింగ్ వేసే క్లాత్ ను ఫ్రేమ్ లను మాటూర్ ఉన్నత పాఠశాలకు ఉచితంగా అందజేశారు.
ఈ సందర్భంగా చాంద్ బేగం మాట్లాడుతూ… పాఠశాల విద్యార్థినులు అందరికీ టైలరింగ్ ఉచితంగా నేర్పిస్తానని, ప్రభుత్వం అందించే యూనిఫారాలు వారికి సరిపడే సైజుల్లో ఉచితంగా స్టిచ్చింగ్ చేసి ఇస్తానని హామీ ఇచ్చారు.
పాఠశాల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే కుట్టు మిషన్, అల్లికల సామాగ్రి ఉచితంగా అందించిన హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ సభ్యులకు పాఠశాల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సంక్రాంతి శ్రీనివాసరావు, కొలగాని ప్రసాదరావు, మేడేపల్లి శ్రీనివాసరావు, కంచిపోగు ఆదాము, రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు, వేము రాములు, మహ్మద్ చాంద్ బేగం, గుంటుపల్లి రమాదేవి, వేములపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.