ఆయిల్‌ ట్యాంకర్‌లోకి దిగి ఏడుగురు మృతి

ఆయిల్‌ ట్యాంకర్‌లోకి దిగి ఏడుగురు మృతి

0
TMedia (Telugu News) :

ఆయిల్‌ ట్యాంకర్‌లోకి దిగి ఏడుగురు మృతి

టీ మీడియా, ఫిబ్రవరి 9,కాకినాడ : ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని పెద్దాపురం మండలం జీ.రాగంపేలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలోని ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ట్యాంకర్‌ను శుభ్రం చేయడానికి దిగిన కార్మికులు. ఒకరి తర్వాత ఒకరు ఊపిరాడక మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఐదుగురిని పాడేరుకు చెందినవారిగా గుర్తించారు. మిగిలిన ఇద్దరు పెద్దాపురం మండలంలోని పులిమేరు వాసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయిల్ ఫ్యాక్టరీలో ట్యాంకర్‌లోకి దిగి ఏడుగురు మృతిప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 30మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఎటువంటి భద్రత లేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : కేంద్రం కుట్రను భగ్నం చేస్తాం..

ఏడాది క్రితమే ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. 15రోజుల క్రితమే కార్మికులు ఫ్యాక్టరీలో చేరినట్లు సమాచారం.కాకినాడ జిల్లాలో విషాదం.. ఆయిల్ ఫ్యాక్టరీలో ట్యాంకర్‌లోకి దిగి ఏడుగురు మృతికాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆయిల్ ఫ్యాక్టరీలో ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతిచెందారు. పెద్దాపురం మండలం జి. రాగంపేట అంబటి ఆయిల్స్ ఫ్యాక్టరీలో ఈ విషాధ ఘటన చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్‌ను శుభ్రపర్చేందుకు ట్యాంకర్‌లోకి దిగిన క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారంతా ఊపిరాడక అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఐదుగురు పాడేరుకు చెందినవారు కాగా, మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరకు చెందిన వారిగా గుర్తించారు.ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 30మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఎటువంటి భద్రత లేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితమే ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. 15రోజుల క్రితమే కార్మికులు ఫ్యాక్టరీలో చేరినట్లు సమాచారం.

Also Read : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిలువు దోపిడీ

ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఫ్యాక్టరీ వద్దకు వెళ్లి పరిశీలించారు. మృతుల్లో కుర్రా రామారావు (54), వెచ్చంగి కృష్ణ (35), వెచ్చంగి నరసింహ, వెచ్చంగి సాగర్, కురతాడు బంజిబాబుగా గుర్తించారు. పులిమేరకు చెందిన మృతుల్లో కట్టమూరి జగదీశ్, ప్రసాద్ ఉన్నట్లు గుర్తించారు.పెద్దాపురం జి. రాగంపేట ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాద ఘనటపై మంత్రి దాశెట్టిరాజా ఆరాతీశారు. ఏడుగురు మరణించడం బాధాకరమని అన్నారు. ఘటన వివరాలను జిల్లా ఎస్పీ, కలెక్టర్ స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి అని అధికారులకు మంత్రి ఆదేశించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube