టీ మీడియా, వనపర్తి అక్టోబర్ 26 : వనపర్తి జిల్లా కేంద్రంలోని వివేకానంద విగ్రహం ముందు ఉన్న ప్రధాన కాలువ భగీరథ విగ్రహం వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర కాలువలో చెత్తాచెదారం మట్టి 5 ఫీట్ల పొడవు ఉండే కాలువలో గత కొన్ని నెలలుగా పేరుకొని పోయి కాలువ మొత్తం నిండిపోయింది. దాని స్థానిక కౌన్సిలర్ గాని మున్సిపల్ అధికారులు గాని పట్టించుకునే వారే లేకుండా పోయింది. రిజిస్టర్ కార్యాలయానికి వచ్చేవారు బహిరంగ మలమూత్ర విసర్జన చేయడం వలన చెడు వాసన వస్తుందని కాలనీవాసులు అంటున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కాలువలో ఉన్న మట్టిని తొలగించి శానిటైజర్ చేయాలని కోరారు.