మహిళకు కుట్టుమిషన్ అందజేత
టి మీడియా, జనవరి 21, కరీంనగర్ జిల్లా : జీవనాధారం లేని దివ్యాం గుడైన కొడుకుతో పోషణ భారంగా ఉన్న ఒంటరి మహి ళకు భూమిక ఉమన్స్ కలెక్టివ్ సపోర్ట్ సెంటర్ ద్వారా ఒక కుట్టు మిషన్‌ను అందించి చేయూతనిచ్చింది. భూమిక స్వచ్ఛంద సంస్థ మహిళా ఠాణాకు వచ్చే బాధిత మహిళ లకు కౌన్సెలింగ్ అందించడంతోపాటు, వారి జీవనోపాధికి అవకాశాలను కల్పిస్తోన్నది. ఈ మేరకు ఆ మహిళకు శనివారం కరీంనగర్ మహిళా పోలీసు ఠాణా సీఐ బి శ్రీనివాస్ చేతులమీదుగా కుటుమిషన్ను అందజేశారు. కార్యక్రమంలో భూమిక సపోర్ట్ సెంటర్ కౌన్సెలర్ స్వరూప ఎ, ఏఎస్ఐ విజయమణి, హెడ్‌కానిస్టేబుల్ చంద్రమౌళి, కానిస్టేబుల్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.