మహిళాపోలీస్ కు వేధింపులు

హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ సస్పెండ్

1
TMedia (Telugu News) :

మహిళాపోలీస్ కు వేధింపులు
-తక్షణమే స్పందించిన సిపి
– హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ సస్పెండ్*
టి మీడియా,మర్చి 12, విజయవాడ: కృష్ణాజిల్లా విజయవాడ నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ కు తన సహచర పోలీసుల నుంచే వేధింపులు తీవ్రమయ్యాయి. ఈ వేధింపులను సంబంధిత స్టేషన్ అధికారుల ద్వారా నగర పోలీస్ కమిషనర్ కు చేరవేయడం జరిగింది అంతే క్షణాల్లో స్పందించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రానా, ఆగమేఘాలమీద స్పందించి ఆదేశాలు జారీ చేశారు. బాధిత మహిళకు బెజవాడ పోలీసు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మహిళా పోలీస్ ను వేధిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ ను సస్పెండ్ చేశారు. అదే సందర్భంలో తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. వేధింపులకు గురి చేయటం మరొకసారి జరిగితే, తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

Also Read : జాతీయ బహుమతి సాధించినందుకు సన్మానం

బెజవాడ పోలీసులలో ఈ చర్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బాధిత మహిళా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు, తన సమస్యపై తక్షణమే స్పందించిన విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రా నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పోలీస్ శాఖ లో ఉంటూ మగువలను వేధించడం లో ఆనంద రూటే సపరేటు అని చెప్పి విమర్శలు వస్తున్నాయి. తాజాగా నగరంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఒక మహిళా కానిస్టేబుల్ పై చేసిన వేధింపుల పర్వం నేపథ్యంలో పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆనంద్ గత చరిత్రను తొంగిచూస్తోంది. ఈ సందర్భంగా అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసు వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది. కొండపల్లి ఇబ్రహీంపట్నం ప్రాంతంలో విధులు నిర్వహించే సందర్భంలో ఆనంద్ కొండపల్లి ఖిల్లా ని సందర్శించే వారిని తనదైన శైలిలో బెదిరించి, వారిపై లైంగిక దాడులకు పాల్పడ్డారని విమర్శలు ఉన్నాయి.

Also Read : అదనపు కలెక్టర్ సంతకం ఫోర్జరీ

నాడు వచ్చిన ఆరోపణలపై అప్పటి పోలీస్ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను గ్రహించి బాధితులకు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే పోలీసు ఉన్నతాధికారులు సదరు లైంగిక వేధింపులకు పాల్పడిన ఆనంద్ పై వేటు వేయడం జరిగింది. తాజాగా మళ్లీ ఓ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ పై వేధింపుల పర్వం నేపథ్యంలో మరొకసారి ఆనంద్ సస్పెండ్ కు గురవడం పోలీస్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఆనంద్ పై కఠిన చర్యలు తీసుకొని మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ గట్టి చర్యలు చేపట్టాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube