ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హాస్టల్ సందర్శన

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హాస్టల్ సందర్శన

1
TMedia (Telugu News) :

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హాస్టల్ సందర్శన
టీ మీడియా, మార్చి 17,మెదక్: జిల్లా చిన్న శంకరం పేట్ లో ఉన్నటువంటి కేజీబీవీ హాస్టల్ లో జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేక హాస్టల్ ప్రిన్సిపాల్లకు ఇష్ట రాజ్యం అయిపోయిందని పిల్లలకు వచ్చే ప్రతీ దానిని ఇవ్వకుండా అక్రమ రవాణా వ్యాపారం చేస్తున్నారని విద్యార్థులు అడుగుతే సర్టిఫికెట్లతో బెదిరిస్తున్నారని ఎస్ ఎఫ్ ఐ మెదక్ జిల్లా అధ్యక్షుడు జగన్ అన్నారు. బుధవారం చిన్న శంకరంపేట్ మండలంలో ఉన్న కేజీబీవీ హాస్టల్ ను ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సందర్శన చేసి ఈ విషయమై జగన్ మాట్లాడుతూ. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టడం లేదని విద్యార్థులకు నీళ్ల చారు తోనే సరిపెడుతున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు 184 ఉండగా ఒక కిలో కందిపప్పు తోటే సరి పెడుతున్నారని పెడుతుందని అన్నారు. ఇలాంటి పరిస్థితులే జిల్లాలో లో జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సి సి కెమెరా లు నడవడం లేదనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిప్పళ్ తూర్థి కేజీబీవీ హాస్టల్ ఎంక్వయిరీ తొందరగా బయటకు రావాలని అన్నారు. జిల్లా ఉన్నత అధికారులు సందర్శన చేయాలని లేనిపక్షంలో డీఈఓ ఆఫీస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్, ఎస్ఎఫ్ఐ చిన్న శంకరం పేట మండల నాయకులు శశి, అజయ్, రాజు, అనిల్ పాల్గొన్నారు.

Also Read : నదులపై కేంద్ర గెజిట్‌తో జల సంక్షోభం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube