పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లు,ఫీజురీయంబర్స్మెంట్ విడుదల చెయ్యాలి- ఎస్.ఎఫ్.ఐ

0
TMedia (Telugu News) :

టీ మీడియా బోనకల్

గ్రామ గ్రామాన కేటీఆర్ పర్యటను అడ్డుకుంటామని బోనకల్ మండల SFI కార్యదర్శి వెంకటేశ్వరావు అధ్యక్షుడు రాకేష్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ రెండేండ్లుగా చెల్లించడం లేదని, దీంతో దాదాపు రూ.3,100 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ కోసం దాదాపు 15 లక్షల మంది విద్యార్ధులు ఎదురుచూస్తున్నారన్నారు.

మరోవైపు డబ్బులు కట్టకపోవడంతో సర్టిఫికెట్ ఇవ్వడం లేదని,దీంతో విద్యార్థులకు ఉన్నత చదువులకు వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.కొందరు తల్లిదండ్రులు బయట అప్పు తెచ్చి కాలేజీ ఫీజులు కడుతున్నారని,తెచ్చిన అప్పులకు రోజురోజుకు వడ్డీ పెరిగిపోతోందని, సర్కార్ వెంటనే బకాయిలు విడుదల చేయాలని కోరారు.రాష్ట్ర వ్యాప్తంగా ఏటా సుమారు 12.5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ చెల్లించాల్సి ఉంటుంది.

ఇందుకు రూ.2,400 కోట్లు అవసరమవుతాయి. 2019–20 అకడమిక్ ఇయర్ కు గాను రాష్ట్ర సర్కార్ సగం బకాయిలు కూడా చెల్లించలేదు. ఇంకా రూ 800 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని ఇక 2020–21కి సంబంధించి పూర్తిగా చెల్లించలేదని అన్నారు.విధ్యార్ధులకు స్కాలర్‌‌షిప్, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ శాంక్షన్‌‌ చేసి, టోకెన్లు జారీ చేస్తున్నా, అకౌంట్లలో మాత్రం డబ్బులు పడటం లేదన్నారు.

మొత్తం రెండేండ్లకు కలిపి రూ.3,100 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని, అత్యధికంగా బీసీ సంక్షేమ శాఖలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారన్నారు. విద్యార్థులు చనిపోతున్నా కనికరం లేదని,ఇంకొంత మంది ఫీజులు చెల్లించలేక, సర్టిఫికెట్లు కాలేజీలోనే వదిలేసి పై చదువులు ఆపేస్తున్నారని అన్నారు.స్కాలర్షిప్పులు మరిము ఫీజురీయంబర్స్మెంట్ను విడుదల చేయకుండా మంత్రి ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తే విద్యార్థులతో కలిసి అడ్డుకుంటాం అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube