శాకాంబరి అమ్మవారి బోనాల జాతర

శాకాంబరి అమ్మవారి బోనాల జాతర

1
TMedia (Telugu News) :

శాకాంబరి అమ్మవారి బోనాల జాతర…

టీ మీడియా, జులై19, రామకృష్ణాపూర్; క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సోమవారం ఆర్కే-3 గని ఏరియాలో కొలువై ఉన్న కనకదుర్గ దేవి అమ్మవారు ప్రజలకు ఆషాడ మాసంలో కూరగాయలు, పండ్ల అలంకారణతో శాకాంబరి అమ్మవారి రూపంలో ప్రజలకు దర్శనమిస్తుంది. ఈ ఆషాడ మాసంలో కరువుకాటకాలు రాకుండా కాపాడమని భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా ఆషాడ మాసంలో బోనాల జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, బోనాలు, మొక్కులు చెల్లించుకున్నారు.

 

Also Read : వీఆర్వోల సమస్యలు పరిష్కరించాలి

అనంతరం అన్నదానం కార్యక్రమంలో భక్తులు తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అమ్మవారి ఆలయంలో 22 సంవత్సరాల నుండి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయాన్ని ప్రభుత్వం దూప దీప పథకం,ఎన్డోమెంట్రీయం ద్వారా గుర్తించాలని సన్యాసి రామ ఋషి శిష్యులు కుమార్, తదితరులు ప్రభుత్వాన్ని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube