టీఎన్జీవో లో విఆర్వోలు అంతర్భాగమే
-టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు షేక్.అప్జల్ హసన్
టి మీడియా, జూన్ 15 ఖమ్మం:టీఎన్జీవోస్ యూనియన్ లో విఆర్వో వ్యవస్థ అంతర్భాగమే.విఆర్వోలు ఎవరు కూడా అధైర్య పడవద్దని టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు షేక్.అప్జల్ హసన్ అన్నారు.ఖమ్మం నగరంలో బుధవారం టీటీడీసీలో జరిగిన విఆర్వోల రాష్ట్ర స్థాయి సమావేశానికి ముఖ్య అతిధులు గా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు షేక్.అప్జల్ హసన్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.వి.ఎస్.సాగర్ లు హాజరయ్యి మాట్లాడారు.
Also Read : కలెక్టర్ విస్తృత పర్యటన
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఆర్వోల జాబ్ చార్ట్ ప్రకటన, పదోన్నతి,కారుణ్య నియామకాలు తదితర అపరిష్కృత సమస్యలపై కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మామిళ్ల రాజేందర్ గారి దృష్టికి తీసుకెళ్లి, ఆయన సహకారం తో సీఎం కేసీఆర్ గారి అపాయింట్ మెంట్ తీసుకుని విఆర్వోల ,వీ ఆర్ ఏ ల పే స్కేల్ తదితర సుదీర్ఘకాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు .విఆర్వోలు ,వీ ఆర్ ఏ లు ఎవ్వరు కూడా అధైర్య పడకుండా,మనస్తాపానికి గురవ్వకుండా మనో ధైర్యం తో తమ విధులు నిర్వహించుకోవాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో విఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికపాటి ఉపేందర్,జిల్లా అధ్యక్షులు షేక్. నాగుల్ మీరా,జిల్లా ప్రధాన
కార్యదర్శి చీమల నాగేందర్ ,రాష్ట్ర,జిల్లా స్థాయి బాద్యులు పాల్గొన్నారు.