ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 4 వనపర్తి : ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఫీల్డ్ అసిస్టెంట్ రెండు వారాల్లోగా విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్ గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మద్దూరి రాఘవేంద్ర, ఉపాధ్యక్షులు వెంకటరావు, జైపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7400 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు వీధుల్లోకి తీసుకురావాలని ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. గత రెండు సంవత్సరాలుగా వేతనాలు లేక చాలా మంది ఫీల్డ్ అసిస్టెంట్లు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారిని విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube