టిఆర్ఎస్ ఎనిమిదేళ్ళ పాలనతో ప్రజలు విసిగిపోయారు

మద్దెల ప్రసాదరావు

1
TMedia (Telugu News) :

టిఆర్ఎస్ ఎనిమిదేళ్ళ పాలనతో ప్రజలు విసిగిపోయారు

-మద్దెల ప్రసాదరావు

టీ మీడియా,జూన్25, మధిర:తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఎనిమిదేళ్ళ పాలనతో ప్రజలు విసిగిపోయారని, వైయస్ షర్మిల నాయకత్వంలో రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చేందుకు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేయాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు రిటైర్డ్ సీఐ మద్దెల ప్రసాదరావు జిల్లా అధ్యక్షులు లక్కినేని సుధీర్ ఖమ్మం అసెంబ్లీ కోఆర్డినేటర్ తుంపా కృష్ణ మోహన్ పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు వారు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. తెలంగాణ టిఆర్ఎస్ ఎనిమిదేళ్ళ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా వైయస్సార్ తెలంగాణ పార్టీని ప్రజల గుర్తించి తెలంగాణలో కొనసాగుతున్న పాదయాత్రకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరవుతున్నారని వారు తెలిపారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రశ్నించే ప్రతిపక్షాలు లేకపోవడంతో వైయస్ షర్మిల ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం కావాలంటే షర్మిలమ్మ రావాలి అనే నినాదంతో షర్మిలమ్మ ఆదేశాల మేరకు ఇంటింటికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అనే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నట్లు వారు తెలిపారు.

 

Also Read : ఖమ్మం రోమన్ కథోలికా మేత్రాసనం ను కాపాడండి అంటూ ధర్నాచౌక్లో నిరసన దీక్ష

 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రైతులకు ఒకే సారి రుణమాఫీ చేశారని, పత్తి విత్తనాల ధరలను తగ్గించారని, ఫీజు రియంబర్స్మెంట్, 108, 104, ఉచిత విద్యుత్, ప్రాజెక్టుల నిర్మాణం అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వటం లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని, మైనార్టీలకు రిజర్వేషన్లు అందించారని వారు గుర్తు చేశారు. ప్రస్తుత టిఆర్ఎస్ పాలనలో నిరుద్యోగ భృతి లేదని, ఎనిమిదేళ్లుగా కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదని, రుణమాఫీ లేదని, ఇల్లు, ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు ఇవ్వడంలేదని వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం కావాలంటే షర్మిలమ్మ రావాలని నినాదాన్ని గ్రామ గ్రామాన మారుమ్రోగే విధంగా నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఇంటింటికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. వైయస్ షర్మిల పాదయాత్ర రాష్ట్ర కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రామిరెడ్డి సూచనలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గడిపల్లి కవిత జిల్లా అధ్యక్షులు లక్కినేని సుధీర్ నాయకత్వంలో సమిష్టిగా పనిచేసి జిల్లాలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలస్యం రవి వల్లూరి సత్యనారాయణ రాంబాబు రూప్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube