వైఎస్ షర్మిల పాదయాత్రను విజయవంతం చేయాలి

వైఎస్ షర్మిల పాదయాత్రను విజయవంతం చేయాలి

1
TMedia (Telugu News) :

వైఎస్ షర్మిల పాదయాత్రను విజయవంతం చేయాలి

టీ మీడియా, నవంబర్ 3, జన్నారం : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు తెలుసుకుని, వారికి నేనున్నానని భరోసా కల్పించడం కోసం,తెలంగాణ రాష్ట్రం లో మళ్లీ వైయస్సార్ సంక్షేమ పాలన తీసుకరావడం కోసం ఆయన కుమార్తె వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మంచిర్యాల జిల్లాలలో నేడు చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వైయస్సార్ టిపి సీనియర్ నాయకుడు కోడూరు చంద్రయ్య ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కలలు కన్నా తెలంగాణను తీసుకరావడానికి ఆయన కుమార్తె షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రంలో 200 రోజులుగా వర్షానికి తడుస్తూ ఎండలో ఎండుతూ 3000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి తొలి మహిళ నాయకురాలిగా చరిత్ర సృష్టించనున్నారని అన్నారు.

Also Read : బిజెపి నాయకులు నిరసన కార్యక్రమం

వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాంతీయ విభేదాలు లేకుండా తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఆయన బాటలోనే వైయస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి తెలంగాణను అన్ని రంగాలలో తీర్చిదిద్దడానికి ముందుకు వచ్చిందని అందులో భాగంగానే చేపట్టిన పాదయాత్రలో భాగంగా నేడు మంచిర్యాల జిల్లాలోని హాజీ పూర్ కు వస్తునందున ఆ పాదయాత్రలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube