షీ టీమ్స్ ను అభినందించిన సీపీ

షీ టీమ్స్ ను అభినందించిన సీపీ

1
TMedia (Telugu News) :

షీ టీమ్స్ ను అభినందించిన సీపీ
టి మీడియా,జూన్ 14,ఖమ్మం:

మహిళలు, చిన్నారుల రక్షణ, సురక్షితమైన సమాజం కోసం వివిధ అవగాహన కార్యక్రమాల ద్వారా చైతన్య పరిచి అత్యంత ఉత్తమ పనితీరుతోరాష్ట్రస్ధాయి ఉత్తమ ప్రతిభ అవార్డును ఆందుకున్న ఖమ్మం షీటీమ్ ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆభినందిచారు. షీ టీమ్ ఉత్తమ ప్రతిభ అవార్డులకు గాను తెలంగాణ రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఇటీవల ప్రకటించిన తెలంగాణ స్టేట్ లెవెల్ అవార్డుల్లో సిఐ అంజలి, ఎస్సై ఉమా ఆధ్వర్యంలోని ఖమ్మం షీటీమ్ కు మొదటి స్దానం లభించింది. అదేవిధంగా షీటీమ్ కంప్యూటర్ అపరేటర్ కానిస్టేబుల్ కె. చక్రధర్ రాజు బెస్ట్ కంప్యూటర్ అపరేటర్ గా రాష్ట్ర స్ధాయి మొదటి స్ధానం అవార్డు అందుకున్నారు. రెండు అవార్డులు ఆందుకున్న షీ టీమ్ బృందం ఈరోజు ఖమ్మం పోలీస్ కమిషనర్ గారిని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ. .

 

Also Read:పోలీసుల ఓవరాక్షన్‌.. సీనియర్‌ నేతకు చేదు అనుభవం.
మహిళా భద్రతకు మార్గదర్శకులుగా నిలవడం,
స్నేహపూర్వకమైన పోలీసింగ్ అందించాలనే పెద్ద లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన షీటీమ్ లతో
మహిళలకు పూర్తిగా సురక్షితమైన మరియు భద్రమైన వాతావరణాన్ని అందించి మరింత భరోసా కల్పించాల్సిన అవసరం వుందన్నారు. ముఖ్యంగా మహిళలపై సైబర్ నేరాలు, ఆన్‌లైన్ వేధింపులు, బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చేయడం వంటి సంఘటనలపై షీ టీం సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చిన్నారుల పట్ల జరుగుతున్న అకృత్యాల నివారణకు షీ టీమ్స్ ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. రాత్రి వేళల్లో చీకటి ప్రదేశాలు నేరాలు జరిగేందుకు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాంతాలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సిఐ అంజలి, ఎస్సై ఉమా ,సిబ్బంది పాల్గొన్నారు.

Also Read:ప్రైవేట్ పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube