కరీంనగర్ షీటీమ్ విభాగాన్ని అభినందించిన పోలీస్ కమీషనర్

కరీంనగర్ షీటీమ్ విభాగాన్ని అభినందించిన పోలీస్ కమీషనర్

2
TMedia (Telugu News) :

కరీంనగర్ షీటీమ్ విభాగాన్ని అభినందించిన పోలీస్ కమీషనర్

టి మీడియా, జూన్ 14,కరీంనగర్ :
రాష్ట్రస్థాయిలో కౌన్సిలింగ్ విభాగంలో ద్వితీయ స్థానం సాధించిన కరీంనగర్ షీటీమ్ విభాగం సభ్యులను సోమవారం నాడు పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ అభినందించారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై సత్వరం స్పందిస్తూ వేగవంతంగా చర్యలు తీసుకుంటూ బాధితులకు సహాయం చేస్తున్నందుకు గాను ఉమెన్ సేఫ్టీ విభాగం రాష్ట్రస్థాయిలో కరీంనగర్ షీ టీం విభాగాన్ని ఎంపిక చేసింది.

Also Read : కళలకు నిలయం పారిశ్రామిక ప్రాంతం

షీ టీమ్ విభాగానికి చెందిన అన్ని స్థాయిలకు చెందిన పోలీసులు సమర్ధవంతంగా పని చేస్తున్నారని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ అన్ని విభాగాల్లోనూ కరీంనగర్ ను ప్రథమశ్రేణిలో కొనసాగే విధంగా  కృషి చేయాలని పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ అన్నారు.ఉమెన్ అచీవర్స్ అవార్డు నకు ఎంపికై ఒక లక్ష రూపాయల నగదు రివార్డును అందుకున్న షీ టీమ్ సభ్యురాలు ఆకుల స్వప్న ను ప్రత్యేకంగా అభినందించారు.

Also Read : కలుషితమైన ఆహారం తిని గొర్రెలు మృతి

ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి(ఎల్&ఓ) ఎస్  శ్రీనివాస్, కరీంనగర్ టౌన్ ఏసీపీ తుల శ్రీనివాసరావు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస్,ఎస్ఐ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube