గండం గట్టెక్కిస్తాం, తాయత్తుతో తరిమేస్తాం

-గవ్వల డాక్టర్ వైద్యం

0
TMedia (Telugu News) :

గండం గట్టెక్కిస్తాం, తాయత్తుతో తరిమేస్తాం

-గవ్వల డాక్టర్ వైద్యం

టీ మీడియా, జనవరి 23,మహబూబాబాద్ : చదివింది టెన్త్ క్లాస్. తెరిచింది హాస్పిటల్. దానిపక్కనే భారీ ఎత్తున మెడికల్ షాప్. లోలోపల ఎమర్జెన్సీ వార్డులు, స్పెషల్ స్టాఫ్.. ఇది షరా మామూలేగా? అనుకోవచ్చు. కానీ బ్యాక్ డోర్లో నడుస్తుందో కొత్త దందా..ఇంతకీ అదేంటంటారా? ఈ డాక్టర్ నాడి పట్టి ఎంతగా వైద్యం చేస్తారో.. గవ్వలేసి.. మిమ్మల్నో దుష్ట శక్తి ఆవహించిందంటూ అంతగా భయపెట్టేస్తారు. పేషెంట్లు ఆ భయంలో ఉండగానే.. తాయిత్తులు కట్టి మరీ భూత వైద్యం చేస్తామంటారు. ఇంత ఖర్చవుతుందని చెప్పి.. జేబు ఖాళీ చేస్తారు. ఈయనొక ఆల్ ఇన్ వన్ డాక్టర్. ఇటు ఇంగ్లీష్ మెడిసన్.. అటు భూత వైద్యం.. రెండూ కలిపి కొట్టేస్తారు. అంటే ఒక దెబ్బ రెండు పిట్టలన్నమాట. ఇటు మాములు వైద్యానికి నమ్మేవారికి ఒక రేటు.. అటు భూత వైద్యాన్ని నమ్మేవారికి మరో రేటు. అసలు ఈ వైద్యం ఎలా చేస్తాడో చదవాల్సిందే..ఇక్కడికొచ్చేవారు ఈ డాక్టర్ చేసే వైద్యం చూసి ఆశ్చర్య పోతుంటారు. ఇదెలా సాధ్యం..? సైన్సు- భూత వైద్యం రెండు వేరు వేరు కదా..? అని షాకై పోతుంటారు. ఇతగాడి తెలిసీ తెలియని వైద్యంతో ప్రాణాపాయం ఏర్పడుతోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.ఇంతకీ ఈ డబుల్ ధమాకా డాక్టర్ ఎక్కడుంటాడనేగా మీ అనుమానం. ఈ ఆర్ఎంపీ కమ్.. భూత వైద్యుడు గారుండేది.. మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండల కేంద్రంలో. ఈయన పేరు శ్యామ్ సుందర్. ఆర్ఎంపీగా క్లినిక్ ప్రారంభించిన ఈ వైద్యుడికి ఎందుకనో.. ఆశ తీరలేదు. తాను స్వయంగా ఆర్ఎంపీ డాక్టర్ గా ఉంటూనే.. బినామీ పేరిట మెడికల్ షాప్ సైతం నిర్వహిస్తుంటారు. ఇటు రెండు చేతులతో సంపాదిస్తూనే.. అటు మూడో దందా కూడా తెరిచేశారు… ఒక ఆర్ఎంపీ డాక్టర్.. నిబంధనల ప్రకారం ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ మాత్రమే చేయాలి. కానీ ఈయనది మాత్రం అంతా నేనే అనే టైపు. ఇటు చిన్నపిల్లలకు వైద్యం చేస్తారు. అటు పెద్దలకు కంటి వైద్యం సాగించేస్తారు. ఇవే కాదు.. ఇదే ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం ల్యాబ్. మరీ సీరియస్ పేషెంట్లయితే.. వారిని అడ్మిట్ చేసుకోవడానికి స్పెషల్ వార్డులు, స్టాఫ్‌ ఇలా.. అన్ని హంగులతో ఈ ఆస్పత్రి నడుపుతున్నాడు శ్యామ్ సుందర్.

Also Read : హిజాబ్ వివాదంపై త్రిస‌భ్య ధ‌ర్మాస‌నంతో విచార‌ణ‌

పైకి సైన్సు మొత్తం తెలిసిన కంప్లీట్ ఇంగ్లీష్ మెడిసిన్ చేసే ఈ డాక్టర్.. లోపల భూత వైద్యుడిగానూ చెలరేగిపోతాడు. ఈయనే కాదు.. ఈయన తరఫున కొందరు ఇక్కడ తాయత్తులు కొడుతూ.. వందలాది రూపాయలు గల్లాలో వేసుకుంటున్నారు.ఇటు తాయత్తులు అటు గవ్వలతో ఈ డబుల్ ఢమాకా డాక్టర్.. స్థానిక జనాల నుంచి ఎంత పెద్ద ఎత్తున కాసుల వసూళ్లు సాగించాలో అంతా చేస్తున్నారు. గవ్వలతో గండాన్ని గుర్తించామని.. తాయత్తుతో మీ చీడ పీడలన్నిటినీ పోగొట్టేస్తామని చెబుతూ ఇతడు చేసే వైద్యం ఈ ప్రాంతంలోనే అతి పెద్ద చర్చనీయాంశంగా మారింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube