విశ్వసపరిక్షలో నెగ్గిన శిండే

విశ్వసపరిక్షలో నెగ్గిన శిండే

1
TMedia (Telugu News) :

విశ్వసపరిక్షలో నెగ్గిన శిండే

టి మీడియా,జులై4,ముంబయి:
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. సోమవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో మెజార్టీ మార్క్‌(144)ను దాటి 164 మంది ఎమ్మెల్యేలు శిందే సర్కాకుకు మద్దతుగా ఓటేశారు. దీంతో బలపరీక్షలో సీఎం నెగ్గినట్లు స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ ప్రకటించారు.

 

Also Read : వాహనదారులకు అలర్ట్

ఈ ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే భాజపా, శివసేన నేతల ప్రతిపాదన మేరకు స్పీకర్‌ విశ్వాస పరీక్ష చేపట్టారు. తొలుత మూజువాణీ ఓటు ద్వారా ఈ ప్రక్రియ పూర్తిచేశారు. అయితే డివిజన్‌ ఆఫ్‌ ఓట్‌ పద్ధతిలో బలపరీక్ష చేపట్టాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది. ఇందుకు అంగీకరించిన సభాపతి.. డివిజన్‌ ఆఫ్‌ ఓటింగ్‌ ప్రక్రియ చేపట్టారు. శిందేకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు లేచి నిలబడగా.. అసెంబ్లీ సిబ్బంది లెక్కింపు చేశారు. శిందేకు మద్దతుగా మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube