ప్రతి ఏటా చింతాకు సైజులో పెరుగుతున్న శివలింగం..

ప్రతి ఏటా చింతాకు సైజులో పెరుగుతున్న శివలింగం..

0
TMedia (Telugu News) :

ప్రతి ఏటా చింతాకు సైజులో పెరుగుతున్న శివలింగం..

లహరి, ఫిబ్రవరి 16, బచ్చన్నపేట : భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్ధేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి 19 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నాలుగు రోజులపాటు సిద్ధులగుట్టపై అంగరంగ వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలు, శివపార్వతుల కల్యాణం, అగ్ని గుండాల ప్రవేశం మొదలగు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ వర్గాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఆలయ సమీపంలోని విశాల మైదానంలో నిర్మించిన కల్యాణమండపంతోపాటు సిద్ధేశ్వరస్వామి కొలువుదీరిన ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో హైదరాబాద్‌, జనగామ, యాదగిరిగుట్ట, భువనగిరి ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం సిద్ధేశ్వరస్వామి ఆలయానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది. అంతేకాకుండా మండల కేంద్రమైన బచ్చన్నపేట నుంచి ఆటోలు నడుస్తాయి. కాగా, ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సర్పంచ్‌ గంగం సతీశ్‌రెడ్డి, ఈవో చిందం వంశీ తెలిపారు. ఈ నెల 18న నిర్వహించే శివపార్వతుల కల్యాణానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పద్మలతారెడ్డి దంపతులు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణం తిలకిస్తారని వారు వెల్లడించారు.

Also Read : ఏ సమయంలో శివయ్యను పూజిస్తే అదృష్టం లభిస్తుందో తెలుసా.

శ్రీ సిద్ధేశ్వర ఆలయంలో మహిమాన్వితమైన పుట్టులింగం ఉంది. ఇది భూమిలో నుంచి పుట్టిందని, అందుకే దీనికి పుట్టులింగం (స్వయంభూలింగం) అని పిలుస్తారు. సుమారు మూడు శతాబ్దాలుగా చింతాకు పరిమాణంలో పెరుగుతున్న పుట్టులింగం ప్రస్తుతం కొబ్బరికాయ పరిమాణంలో ఉందని పూజారి ఓం నమఃశివాయ తెలిపారు. 98ఏళ్ల క్రితం లింగం చుట్టుకొలత 21.50 ఇంచులుగా ఉండగా, ప్రస్తుతం చుట్టుకొలత 27.50 ఇంచులు, పొడవు 11.50 ఇంచులు పెరిగినట్లు చరిత్ర చెబుతుంది. పుట్టులింగం పెరుగుతోందనడానికి నిదర్శనంగా మూడు నాగప్రతిమలున్నాయి. ఇందులో రెండు ఇత్తడివి, ఒకటి వెండిది. చింతాకు పరిమాణంలో పెరుగుతున్న పుట్టులింగానికి ఇవి రాబోవురోజుల్లో ఈ ప్రతిమలు సరిపోవంటున్నారు. కొడవటూరు గుట్ట నుంచి కొన్నె, సిద్దెంకి గుట్టలకు సొరంగ మార్గం ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube