శోభాయాత్రను దిగ్విజయం చేయాలి

ఈవో గుజ్జుల కొండారెడ్డి

0
TMedia (Telugu News) :

శోభాయాత్రను దిగ్విజయం చేయాలి

– ఈవో గుజ్జుల కొండారెడ్డి

టి మీడియా, జనవరి 5, హుజూర్ నగర్ : అతి పురాతనమై వెలుగొందుతున్న హుజూర్నగర్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఈ నెల 9 వ తారీఖున జరుగు శోభాయాత్ర ను విజయవంతం చేయాలని  ఈ.వో గుజ్జుల కొండారెడ్డి పుర ప్రముఖులను కోరినారు. శుక్రవారం స్థానిక రామాలయంలో శోభాయాత్ర సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి ప్రసంగించారు. 9 వ తేదీన ఉదయం జరిగే కార్యక్రమాలను సభ్యులకు తెలియజేశారు. రెండవ అతిపెద్ద పండుగ అయిన శోభాయాత్ర ను అన్ని వర్గాల ప్రజలు భక్తులు మహిళలు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా వారిని కోరారు. ఉదయం పూట ప్రాతః కారార్చన విష్ణు సహస్రం, గోదా,రామాజ అష్టోత్తరాలు, తిరుపావై సేవా కాలం లాంటి వైదిక క్రతువులను అర్చకులు నిర్వహించారు. నీరాజనాలతో మహిళలు హారతులు ఇచ్చారు. సాయంకాలం ముకుంద మాల స్తోత్రని పటిస్తూ పల్లకి సేవ నిర్వహించారు.

Also Read : రెడ్డి గార్డెన్ వైపు రోడ్డు వేయించండి

ఇట్టి సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి పుర ప్రముఖులు, గుండా రమేష్, కోటా సూర్యప్రకాష్ రావు, గొట్టే రామయ్య, నర్సింగ్ వెంకటేశ్వర్లు, బెల్లంకొండ సైదులు గౌడ్, కోట వెంకట నరసింహమూర్తి, పులిచింతల నారాయణరెడ్డి, కంచర్ల అరవింద్ రెడ్డి,  జక్కుల శంభయ్య, బాచిమంచి కొండయ్య, కామిశెట్టి నందయ్య ,ఆకుల రాము, చిక్కుల లింగయ్య, గల్లా వెంకటేశ్వర్లు, పిచ్చయ్య, వివిధ సంఘాల నాయకులు, వార్డు కౌన్సిలర్లు, అర్చకులు రాఘవాచార్యులు, నరసింహాచార్యులు, సానాచార్యులు రామకృష్ణమా చార్యులు మహిళలు పెద్ద ఎత్తున ఇట్టి సమావేశానికి హాజరైనారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube