తవ్వకాలను ఆపి రైతాంగాన్ని ఆదుకోవాలి…

మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య

1
TMedia (Telugu News) :

తవ్వకాలను ఆపి రైతాంగాన్ని ఆదుకోవాలి…

మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య
టీ మీడియా,జూన్ 21, పెనుగంచిప్రోలు : మున్నేరు లో జేపీ సంస్థ చేపట్టిన ఇసుక తవ్వకాలనుటీడీపీ జాతీయ కోశాధికారి & మాజీ ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు పరిశీలించారు .ఇసుక క్వారీ లోకి వెళ్లి తవ్వకాలను పరిశీలించారునిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు.నిబంధనలను కాదని వాగులో అక్రమంగా చేపట్టిన తవ్వకాల వల్ల వాగులో వరద ప్రవాహం వలన రైతుల వ్యవసాయ భూములు ఇసుక మేటలు వేస్తున్నాయని, తవ్వకాలకు పక్కనే శివాపురం, అనిగండ్లపాడు రెండు గ్రామాల తాగునీటి పథకాలు ఉన్నాయన్నారు.

Also Read : మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్

వైసీపీ ప్రభుత్వం మున్నేరు లో ఇసుకను అడ్డగోలుగా తోలుతున్నారు.
పెద్ద పెద్ద గుంతలు తీస్తున్నారు ఈ గుంటలలో మనుషులు కావచ్చు, పశువులు కావచ్చు పడి చనిపోయే పరిస్థితి ఉంది. ప్రక్కనే త్రాగునీటి స్కీమ్స్ ఉన్నాయి ఈ త్రాగునీటి స్కీమ్స్ కి 500 మీటర్ల వరకు ఎటువంటి గుంతలు తీయకూడదు అటువంటిది త్రాగునీటి స్కీమ్కు 100 మీటర్ల దూరంలోనే ఇంత పెద్ద లోతైన గుంతలు తీయడం దారుణం అన్నారు. ఇసుకను డంప్ చేసి ఇక్కడ నుంచి తెలంగాణ కు తరలించడం దుర్మార్గమైన చర్య అన్నారు. మా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తే ఈరోజు వైసీపీ ప్రభుత్వం నాయకులు ఇసుక దందా చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమన్నారు.

Also Read : ఒలింపిక్ డే రన్ విజయవంతం చేయండి

ఇప్పటికైనా దుర్మార్గమైన చర్య అని వదిలేసి ఇసుక కావలసినటువంటి వారందరికీ ఉచితంగా ఇసుక అందజేయాలి ఈ అక్రమ తవ్వకాలు వెంటనే ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పెనుగంచిప్రోలు తాసిల్దార్ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో చింతల సీతారామయ్య, జిల్లేపల్లి సుధీర్ బాబు, అత్తులూరి అచ్యుతరావు, గడ్డం యేసుబాబు, కానూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube