మానవత్వం చాటుకున్న గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీవాణి

మానవత్వం చాటుకున్న గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీవాణి

1
TMedia (Telugu News) :

మానవత్వం చాటుకున్న గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీవాణి

 

టీ మీడియా, నవంబర్ 19, గోదావరిఖని : వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న నిరుపేద ముస్లిం అమ్మాయి పెళ్లికి గోదావరిఖని కళ్యాణ్ నగర్ లోని లక్ష్మీ వాణి హాస్పిటల్ లో గైనకాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్న హాస్పటల్ నిర్వాహకురాలు ప్రముఖ వైద్యురాలు లక్ష్మీవాణి,శనివారం తన జన్మదిన పురస్కరించుకొని నిరుపేద కుటుంబానికి చెందిన ఆడపిల్ల పెళ్లికి తన వంతు సహాయంగా 10,000 రూపాయలను అమ్మాయి తండ్రి కాశీం కు అందించారు.

Also Read : రక్తదానం మరియు రొట్టెల పంపిణీ

అనంతరం వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డాక్టర్ సురభి శ్రీధర్ మాట్లాడుతూ…డాక్టర్ లక్ష్మీవాణి తన జన్మదిన పురస్కరించుకొని అమ్మాయి పెళ్ళి కి ఆర్థిక సాయం చేసినందుకు కృతజ్ఞతలు అని అన్నారు.
ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఆ అమ్మాయి పెళ్ళికి సహాయం అందించండి అని సహాయం అందించేవారు 8977748838 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ పలు డివిజన్ లకు చెందిన ఆర్గనైజర్లు దోంత కనక లక్ష్మి,గాండ్ల స్వరూప, పల్లపు నీలావతి,చిలుక భారతి,సురభి శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube