లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ
టీ మీడియా, జనవరి 13, హైదరాబాద్ : హైదరాబాద్ బహదూర్పురా పోలీసు స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్ శ్రవణ్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ సిటిజెన్ నుంచి రూ. 8 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఓ వ్యక్తి ఫోన్ను పోలీసులు సీజ్ చేశారు. అయితే తన ఫోన్ తనకు తిరిగి ఇవ్వాలని బాధిత వ్యక్తి ఎస్ఐ శ్రవణ్ కుమార్ను సంప్రదించాడు.
Also Read : చదరంగం పోటీలను ప్రారంభించిన వైస్ చైర్మన్
ఈ క్రమంలో ఎస్ఐ లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఎస్ఐ రూ. 8 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube