ఏస్ ఐ,కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల

ఏస్ ఐ,కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల

1
TMedia (Telugu News) :

ఏస్ ఐ,కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల

టీ మీడియా,అక్టోబర్ 22,హైదరాబాద్‌: తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్ ఫ్ బోర్డు ఫలితాలను వెల్లడించింది. సివిల్‌ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో 46.80 శాతం, సివిల్‌ కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షలో 31.40శాతం, రవాణా కానిస్టేబుల్‌ పరీక్షలో 44.84శాతం, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పరీక్షలో 43.65శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొంది. పోలీస్‌ సివిల్‌ విభాగంలో 15,644.. ఆబ్కారీశాఖలో 614.. రవాణాశాఖలో 63 కానిస్టేబుల్‌ పోస్టుల కోసం 1601 కేంద్రాల్లో ఆగస్టు 7న ప్రాథమమిక పరీక్ష జరిగింది. మొత్తం 6,61,198 మంది దరఖాస్తుదారులకుగాను 6,03,955 (91.34శాతం) మంది హాజరయ్యారు.

Also Read : భారీగా హవాలా సొమ్ము పట్టివేత

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) నిర్వహించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల రాత పరీక్షల కటాఫ్‌ మార్కులను ప్రభుత్వం సవరించింది. 200 మార్కులకుగాను 60 మార్కులు ఓసీలకు, 50 బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు 40 మార్కులు ఉంటాయని పేర్కొంది. గతంలో ఈ మార్కులు ఓసీలకు 80, బీసీలకు 70, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం ఉండగా.. దీన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్‌ విచారణలో ఉండగానే ప్రభుత్వం కటాఫ్‌లను సవరించడంతో ధర్మాసనం పిటిషన్‌పై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube