ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
టీ మీడియా,ఏప్రిల్ 14, గోదావరిఖని :
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదేశాల మేరకు,విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ,కానిస్టేబుల్ అభ్యర్థులకు 13,14 తేదీలలో రెండు రోజులపాటు స్థానిక జవహర్ లాల్ నెహ్రూ సింగరేణి స్టేడియం గ్రౌండ్ లో ఉచిత శిక్షణ కార్యక్రమం చేపట్టారు. బుధవారం నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ను గోదావరిఖని వన్ టౌన్ సిఐ రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.పోలీసు ఉద్యోగాల ప్రాముఖ్యత, విలువల గురించి అభ్యర్థులకు వివరించారు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 20మంది వరకు మాత్రమే పోలీసు ఉద్యోగాలకు ఎంపికయ్యేవారని, కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వంద పైచిలుకు అభ్యర్థులు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికవుతున్నారన్నారు.
Also Read : అగ్నిమాపక వారోత్సవాలు పోస్టర్ ఆవిష్కరణ
రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ ఈ ప్రాంత యువకులకు ఉద్యోగాల కల్పనలో భాగంగా విజయమ్మ పౌండేషన్ ద్వారా ఉచితంగా ఎస్ఐ,కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ఏర్పాటు చేశారని ఈ ప్రాంత నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ టెస్టుకు సుమారు 120 మంది హాజరుకాగా, వారికి పరుగు,దేహధారుఢ్య పరీక్షలు నిర్వహించారు. గురువారం కూడా ఉదయం 6గంటల నుండి 8గంటల వరకు స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుందని, ఎంపికైన అభ్యర్థులకు ఉదయం 6 నుండి ఏడున్నర వరకు స్టేడియం గ్రౌండ్ లో భౌతిక శిక్షణ,9 గంటలకు, మధ్యాహ్నం ఒంటిగంటకు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో థియరీ క్లాసులుజరుగుతాయన్నారు.ఈ కార్యక్రమంలో పౌండేషన్ నిర్వాహకులు అబ్బ రమేష్ తదితరులు పాల్గొన్నారు..
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube