వాహనదారులకు అవగాహన కల్పించిన ఎస్సై

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 22 వనపర్తి :పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఉడిపి హోటల్ దగ్గర బుధవారం సాయంత్రం వాహనాలను రోడ్డుపై పెట్టరాదు అని షాప్ యజమానులకు వాహనదారులకు ఎస్ఐ బి. రామస్వామి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్కు అంతరాయం కలిగించరాదని తెలియజేశారు.వాహన దారులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినట్టు అయితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇకపై షాప్ దగ్గర వాహనాలు పెడితే యజమానులకు వాహనదారులకు చాలన్ వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కుని అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. మాస్క్ మనకు శ్రీరామరక్ష వాహనదారులకు హెల్మెంట్ ప్రాణ రక్ష అన్నారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube