బెల్ట్ షాపులు పై దాడులు చేసినఎస్సై  

బెల్ట్ షాపులు పై దాడులు చేసినఎస్సై  

1
TMedia (Telugu News) :

బెల్ట్ షాపులు పై దాడులు చేసినఎస్సై  

అంబేద్కర్ కోనసీమ జిల్లా:
అల్లవరం మండలంలోని రెండు గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయిస్తున్న బెల్టుషాపులపై అల్లవరం ఎస్.ఐ శ్రీను నాయక్ సిబ్బందితో శనివారం దాడులు నిర్వహించారు. మొగళ్లమూరు గ్రామంలో
కొల్లాటి నాగ చందర్రావు బెల్టు నడుపుతున్నాడు అన్న సమాచారంతో అల్లవరం ఎస్ఐ శ్రీను నాయక్ సిబ్బందితో దాడి చేసి పది బాటిల్స్ (వన్ ఎయిట్యి ఎంఎల్) ఆఫీసర్ ఛాయిస్,
ఒకటి (సెవెన్ ఫిఫ్టీ ఎమ్.ఎల్) ఓసి బ్లూ, కింగ్ఫిషర్ బీర్లు రెండు మొత్తం 13 బాటిల్స్ సీజ్ చేసి అతని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగిందన్నారు. సిరగట్లపల్లిలో సంగాడి మీరమ్మ తను ఆమె బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారని సిబ్బంది రైడ్ చేసి తొమ్మిది హెచ్డి బాటిల్స్ సీజ్ చేసి ఆవిడపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపించడం జరిగిందని ఎస్.ఐ శ్రీను నాయక్ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube