గన్‌తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య

గన్‌తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య

1
TMedia (Telugu News) :

గన్‌తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య

టి మీడియా,మే13,కాకినాడ:జిల్లా లోని సర్పవరం ఎస్. ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో సర్వీస్ రివాల్వర్లో కాల్చుకుని చనిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు ఎస్సై ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతదేహం కాకినాడ జిజిహెచ్ కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నముత్తవర పగోపాలకృష్ణ స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట.

Also Read : కార్గో ద్వారా భక్తులకు వేములవాడ రాజన్న ప్రసాదం : సజ్జనార్‌

గతంలో పెనుగంచిప్రోలు తాసిల్దార్ కార్యాలయంలో విఆర్ఓ గా విధులు నిర్వహించి, 2014 సంవత్సరంలో ఎస్సైగా సెలెక్ట్ అయిన గోపాలకృష్ణ.మృతునికి భార్య ,కూతురు, కుమారుడు.అత్యంత సౌమ్యుడిగా గ్రామములో పేరున్న గోపాలకృష్ణ ఆత్మహత్య సంఘటనతో శోకసముద్రంలో మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు మిత్రులు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube