విశ్వబ్రాహ్మణ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి

విశ్వబ్రాహ్మణ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి

1
TMedia (Telugu News) :

విశ్వబ్రాహ్మణ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి

టీ మీడియా, జూలై 27, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణంలో బ్రహ్మంగారి ఆలయం ఆవరణంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య జిల్లాస్థాయి అత్యవసర రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధ్యక్షులు ఉమ్మడి పరమేశ్వర చారి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ విశ్వబ్రాహ్మణ జాతికి 200 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించి ఇంతవరకు ఏమి చేయలేదు విశ్వబ్రాహ్మణ హక్కుల సాధనలో భాగంగా ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చి నిరాహారదీక్ష చేసిన ప్రభుత్వం స్పందించనందన ఈ నెల 30 వ తారీకు రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేయాలని వనపర్తి జిల్లా 14 మండలాల్లో ఉండే ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సోదరి సోదరులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

 

Also Read : అటవీ శాఖ అతిథిగృహము అన్యాక్రాంతము

 

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి పరమేశ్వర చారి, 14వ వార్డు కౌన్సిలర్ బ్రహ్మచారి, టౌన్ అధ్యక్షులు శ్రీ వెంకటచారి, స్టేట్ కమిటీ సభ్యులు డి రామాచారి, ఏం సత్యనారాయణ చారి, ఎన్ నాగరాజు ఆచారి, హేమంత్ ఆచారి, నరేంద్ర ఆచారి, శివ కుమార్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube