ఒక కుటుంబానికి ఒకే పింఛన్‌ దారుణం

ఒక కుటుంబానికి ఒకే పింఛన్‌ దారుణం

1
TMedia (Telugu News) :

ఒక కుటుంబానికి ఒకే పింఛన్‌ దారుణం

టీ మీడియా,ఎప్రియల్ 01,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఒక కుటుంబానికి ఒకే పింఛన్‌ ఇస్తామనడం దారుణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత చర్యలతో దాదాపు 2 లక్షల మంది వృద్ధులు పింఛన్‌కు నోచుకోవడం లేదన్నారు. ఈ మేరకు ఆసరా పింఛన్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. ఆసరా పింఛన్ల వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన హామీ ఏమైందని ప్రశ్నించారు. 57ఏళ్లు నిండిన అర్హులైన దాదాపు 11లక్షల మంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చేస్తున్నారని పేర్కొన్నారు. 2018లో తెరాస సర్కారు ఇచ్చిన హామీని అమలు చేసి ఉంటే ఇప్పటివరకు ఒక్కొక్కరు దాదాపు రూ. 78,624 లబ్ధిపొందేవారన్నారు. ఈ మేరకు బకాయిపడ్డ పింఛన్‌ను వృద్ధులకు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ఆర్భాటం చేయడమే తప్ప అందుకు తగ్గ కసరత్తు చేయకపోవడం శోచనీయమన్నారు. ఆసరా పింఛన్‌ లబ్ధిదారుడు మరణిస్తే… ఆ కుటుంబంలోని అర్హులకు వెంటనే పింఛన్‌ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే నూతన మార్గదర్శకాలు విడుదల చేసి కొత్త పింఛన్ల జారీకి అవసరమైన నిధులను కేటాయించాలని బండి సంజయ్‌ కోరారు.

Also Read : ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ చేయండి.. వాగ్దానాలు మ‌రిచితే ఎలా..?

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube