సిల్వర్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో పోటీలు

సిల్వర్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో పోటీలు

2
TMedia (Telugu News) :

సిల్వర్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో పోటీలు

టీ మీడియా, ఏప్రిల్ 14, వనపర్తి, బ్యూరో : వనపర్తి పట్టణంలో సిల్వర్ జూబ్లీ క్లబ్ వనపర్తి ఆధ్వర్యంలో గురువారం నుంచి నారమ్మ నర్సిరెడ్డి శంకరమ్మ జ్ఞాపకార్థం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి షటిల్ బాడ్మింటన్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ క్లబ్ అధ్యక్షుడు పలుస రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సిల్వర్ జూబ్లీ క్లబ్ వారి ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నామని నాలుగు రోజులు జరుగుతాయని అందరికీ భోజనం ఏర్పాటు చేశామని

Also Read : అనాధ బాలిక పట్ల పోలీసుల ఔదార్యం

గెలుపొందిన విద్యార్థులకు డబుల్స్ విభాగంలో ప్రథమ బహుమతి కింద 50000, ద్వితీయ బహుమతి 25000, సింగిల్స్ ప్రధమ 25000, ద్వితీయ 12,500 విలువగల గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరుగుతుందని పోటీలకు భోజనం డబుల్స్ విజేతలకు దాతగా కృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రంగాపురం సింగల్స్ బహుమతి దాతగా రఘువర్ధన్ రెడ్డి డిఎల్ఆర్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమమునకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిల్వర్ జూబ్లీ క్లబ్ కార్యదర్శి గోపీనాథ్, సుధీర్ రెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, సిల్వర్ జూబ్లీ క్లబ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube