సింగరేణి సంస్థను పైవేటిపరం చేసేందుకు కేంద్రం కుట్రలు…

ఎమ్మెల్యే జిల్లా టి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి

1
TMedia (Telugu News) :

సింగరేణి సంస్థను పైవేటిపరం చేసేందుకు కేంద్రం కుట్రలు…
– బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ఆలోచన కేంద్రం మానుకోవాలి
ఎమ్మెల్యే జిల్లా టి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి
టీ మీడియా, మార్చి30,రామగుండం :తెలంగాణ కొంగు బంగారం సింగరేణి సంస్థ సింగరేణి సంస్థకు చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేసి కార్మికుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది… కేంద్ర ప్రభుత్వం విధానాలపై కార్మిక లోకమంతా కన్నెర్రచేసిందని, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ 48 గంటల సమ్మె లో సింగరేణి కార్మికులు విజయవంతంగా చెపట్టారని రామగుండం ఎమ్మెల్యే జిల్లా టి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ గారు అన్నారు. మంగళవారం గోదావరిఖని పట్టణంలోని కేంద్ర టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా 20 కోట్ల కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేయడం జరిగిందన్నారు. సమ్మె లో సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు ఒక్కతాటి పై నిలిచారరన్నారు. సింగరేణి లో నాలుగు బొగ్గు బ్లాకుల వెలం ఆలోచన కేంద్రం మానుకోవాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం చూస్తుందన్నారు. తెలంగాణ కార్మికవర్గాన్ని సిఎం కేసీఆర్‌ గారు కంటికి రెప్ప లగా కాపాడుతున్నారని అన్నారు. సింగరేణి గని కార్మికులకు టీఆరెఎస్ పార్టీ టీబీజీకేఎస్ యూనియన్ ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు. రాబోవు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ఈ విలేఖరుల సమావేశంలో టీబీజీకేఎస్ యూనియన్ నాయకులు కార్యకర్తలు మరియు తెరాస పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Also Read : అద్దంలా మెరుస్తున్న రోడ్లు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube