సింగరేణి కాంట్రాక్టు కార్మికుల భిక్షాటన

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల భిక్షాటన

2
TMedia (Telugu News) :

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల భిక్షాటన

టీ మీడియా,సెప్టెంబర్ 19,గోదావరిఖని :సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జె.ఏ.సి.ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె సోమవారం తో 11 వ రోజుకు చేరుకుంది.ఈసందర్భంగా లక్ష్మీ నగర్ లోని వీధులలో భారీ ర్యాలీ నిర్వహించి వ్యాపారస్తుల వద్ద కార్మికులు భిక్షాటన చేసి నిరసన చేయయడం జరిగింది.భిక్షాటనలో కార్మికులకు సహకరించిన ప్రతి వ్యాపారస్థునికి జె.ఏ.సి. నాయకులు విప్లవాభివందనాలు తెలియచేయడం జరిగింది. అనంతరం జె.ఏ.సి.నాయకులు వేల్పుల కుమారస్వామి, తోకల రమేష్,కె.విశ్వనాథ్,
జి.భూమయ్య,మద్దెల శ్రీనివాస్ మాట్లాడుతూ…
11 రోజులుగా సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తున్న యాజమాన్యం పట్టించుకోకుండా నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరుస్తున్నారని అన్నారు.చర్చల పేరుతో కాలయాపన చేస్తూ సమస్యలను సాగదీస్తున్నారని అన్నారు. సింగరేణి పై ఆధిపత్యం కొనసాగిస్తు,అభివృద్ధి పేరుతో డబ్బులు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికుల సమస్యల గురించి ఎందుకు యాజమాన్యంతో మాట్లాడడం లేదని అన్నారు.

Also Read : ఇంట‌ర్ విద్యార్థుల‌కు ట్యాబ్స్ పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వానికి 11 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు కనిపించడంలేదా అన్నారు.మొండిగా ఉన్న యాజమాన్యంతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈనెల 22 న జరుగబోయే చర్చల్లో యాజమాన్యం స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని, ఆవిదంగా కృషి చేయాలని అన్నారు.లేనిపక్షంలో సమ్మెను ఉధృతం చేయడానికి పర్మినెంట్ కార్మిక సంఘాల జె.ఏ.సి.ని కలుపుకుని సింగరేణిని స్తంభించేలా చేస్తామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో కాంగ్రేస్ నాయకులు మక్కాన్ సింగ్,మహంకాళి స్వామి,పెద్దెల్లి ప్రకాష్, పెండ్యాల మహేష్,టి.ఎల్.పి.
నాయకులు గొర్రె రమేష్, బీజేపీ నాయకులు కౌశిక హరి,కార్మిక సంఘాల నాయకులు బి.లింగయ్య, సిహెచ్.ఉపేందర్,శ్యామ్,సాయి,రాజు,స్వప్న,వినోద,ఎన్.రాజేందర్, ఎం.సమ్మయ్య,కె.శంకర్,కె.వెంకటేష్,కోటవెంకన్న,కొమురమ్మ,లతోపాటు అధికసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube