టి మీడియా, డిసెంబర్ 15, మణుగూరు .
సింగరేణిలో అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికై భవిష్యత్తు ఉద్యమానికి కార్యాచరణ రూపకల్పన చేసిన జెఎసి, హైదరాబాదులో ఆర్ ఎల్.సి కార్యాలయం వద్ద సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ సమావేశం జరిగినది.ఈ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, ఇతర హక్కులు, సౌకర్యాల సాధనకై దశలవారీగా ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించినట్లుగా జేఏసీ నాయకులు తెలిపారు.ఈ సమావేశంలో
సిఐటియుసి నుండి
బి, మధు, యర్రగాని కృష్ణయ్య, ఓదేలు ఎఐటియుసి, గుత్తుల సత్యనారాయణ, ఐ ఎఫ్ టి యు సి నుండి
ఏ, వెంకన్న, యాకుబ్ షావలి,తోకల రమేశ్, మధుసూదన్ రెడ్డి, ఐ ఎన్ టియుసి నుండి
కే, నాగభూషణం, బి ఎం ఎస్ నుండి ఐ.నాగేశ్వరరావు ఐ ఎఫ్ టియుసి రాస్ఉద్దీన్,
కే, విశ్వనాథం,తదితరులు పాల్గొన్నారు.