సింగరేణిలో భారీ ప్రమాదం
-కూలిన భూగర్భ గని పైకప్పు
-శిథిలాల కింద నలుగురు సిబ్బంది*
టీ మీడియా, మార్చి 7,గోదావరిఖని:సెంటినరీకాలనీ, న్యూస్‌టుడే: సింగరేణి గనిలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం-3 పరిధిలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు(ఏఎల్పీ) భూగర్భ గనిలో సోమవారం మధ్యాహ్నం సైడు, పైకప్పు కూలిన ప్రమాదంలో ఇద్దరు అధికారులు సహా ఆరుగురు ఉద్యోగులు చిక్కుకున్నారు. వారిలో ఇద్దరు రాత్రి 7 గంటల ప్రాంతంలో సురక్షితంగా బయటపడ్డారు. మరో నలుగురు బొగ్గు శిథిలాల కిందే చిక్కుకుపోయారు. కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. గనిలోని 86 లెవల్ వద్ద వారం రోజుల క్రితం పైకప్పు కూలింది. దాన్ని సరిచేసేందుకు సోమవారం ఉదయం 7 గంటలు, 9 గంటల షిఫ్టు ఉద్యోగులతో సపోర్టింగ్ పనులు నిర్వహిస్తున్నారు. జీఎం పనులను పర్యవేక్షించి వెళ్లిపోయారు. సరిగ్గా మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా సైడ్‌తో పాటు పైకప్పు కూలింది. ఆ సమయానికి అక్కడ పైభాగంలో విధులు నిర్వహిస్తున్న వారు పరుగుతీసి బయటకు చేరుకున్నారు
also read:స్త్రీని గౌరవించడం బాధ్యత :ఏసీపీ
. కింది భాగంలో విధులు నిర్వహిస్తున్న వారికి అడ్డంగా.. 20 మీటర్ల వెడల్పుతో.. భారీ మందంతో.. బొగ్గుబండ కూలడంతో స్థలంలో విధులు నిర్వహిస్తున్న ప్రాంత రక్షణ అధికారి జయరాజ్, గని అసిస్టెంట్ మేనేజర్ చైతన్యతేజ, బదిలీ వర్కర్ రవీందర్, ఒప్పంద కార్మికుడు తోట శ్రీకాంత్‌లతో పాటు వెంకటేశ్వర్లు, నరేశ్‌లు బొగ్గుపొరల మాటున చిక్కుకుపోయారు. అందులో వెంకటేశ్వర్లు, నరేశ్‌లను సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. మిగతా నలుగురిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి కొద్ది దూరంలో పనిచేస్తున్న సపోర్టుమెన్ కార్మికుడు ఎరుకల వీరయ్య స్వల్ప గాయాలతో సురక్షితంగా పైకి చేరుకున్నారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
also read:సంగం బ్యారేజీకి గౌతమ్‌రెడ్డి పేరు: సీఎం వైఎస్ జగన్
సింగరేణి దుర్ఘటనపై సీఎం ఆరా
హైదరాబాద్ : సింగరేణి బొగ్గు గని పైకప్పు కూలిన ప్రమాద దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో అధికారి సహా నలుగురు కార్మికులు చిక్కుకుపోయారనే విషయం తెలిసిన వెంటనే సీఎం ఆరా తీశారు. బాధితులను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సంస్థ సీఎండీ శ్రీధర్‌ను ఆదేశించారు. గాయపడిన వారిని తక్షణమే దవాఖానాకు తరలించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. రక్షణ చర్యలు చేపట్టామని, కూలిన శిథిలాల నుంచి కార్మికులను బయటకు తెచ్చే చర్యలు ముమ్మరం చేశామని సీఎంకు శ్రీధర్ వివరించారు.బాధితుల కుటుంబాలను ఆదుకోవాలి: సంజయ్*
also read:ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది: సీఎం జగన్
గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి ఏఎల్పీ గని ప్రమాదంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గని ప్రమాదంలో బాధితులైన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని, చట్టప్రకారం పరిహారం అందచేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరపాలని కోరుతూ డైరెక్టర్ ఆఫ్ జనరల్ మైన్స్డీజీఎంఎస్కు లేఖ రాసినట్లు వెల్లడించారు.