సింగరేణి సమ్మె ను విజయ వంతం చేయండి

సింగరేణి సమ్మె ను విజయ వంతం చేయండి

1
TMedia (Telugu News) :

సింగరేణి సమ్మె ను విజయ వంతం చేయండి
టి మీడియా,మార్చి22,రామకృష్ణాపూర్:సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటి కరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు దేశ వ్యాప్తంగా మార్చి 28, 29 తేదీలలో తలపెట్టిన రెండు రోజుల సమ్మెను విజయ వంతం చేయాలనీ (ఎస్.సి.డబ్ల్యూ.యూ) ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులను కోరారు. రామకృష్ణాపూర్ బ్రాంచి కార్యదర్శి యం.డి అక్బర్ అలీ ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడుతూ కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను అవలంబిస్తున్నదని అన్నారు. బొగ్గు గనుల ప్రైవేటికరణ ను వేగవంతం చేస్తుందని అన్నారు.. ఇలాంటి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కి నిరసన గా అన్ని కార్మిక సంఘాలు మార్చి 28 & 29 తేదీలలో తలపెట్టిన రెండు రోజుల సమ్మెను మన సింగరేణి కార్మిక సోదరులు అందరూ తప్పకుండా పాల్గొని సమ్మెను 100% విజయవంతం చేయాలనీ అన్నారు.. ఈ కార్యక్రమం లో బ్రాంచి ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య,ఆర్.కె.1ఏ గని వైస్ ప్రెసిడెంట్ గాజుల రాయమల్లు,ఆర్.కె.1ఏ గని ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ సురమళ్ళ వినయ్ కుమార్, కమిటీ సభ్యులు సుంకరి గట్టయ్య, చంద్రకానీ రమేష్, కోమటిపెల్లి సత్తయ్య,, ఏఐటీయూసి కార్యకర్తలు సిద్ధం హరి కృష్ణ, దుగుట హనుమయ్య, గోగు మొండి, అడిచర్ల రాజేశం,కురుమ రమేష్ మరియు కార్మికులు పాల్గొన్నారు.

Also Read : హైద‌రాబాద్‌కు మ‌రో ప్ర‌పంచ‌ ప్ర‌సిద్ధ కంపెనీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube