సింగరేణిని ప్రైవేట్‌పరం న్నది అవాస్తవం: రాజగోపాల్‌రెడ్డి

సింగరేణిని ప్రైవేట్‌పరం న్నది అవాస్తవం: రాజగోపాల్‌రెడ్డి

1
TMedia (Telugu News) :

సింగరేణిని ప్రైవేట్‌పరం న్నది అవాస్తవం: రాజగోపాల్‌రెడ్డి

టి మీడియా, మార్చి 12  హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకొని టీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తున్నారు అనేది వాస్తవం కాదన్నారు. సింగరేణిని ఏ ప్రభుత్వం కూడా ప్రైవేట్ పరం చేయడం లేదన్నారు. సింగరేణిపై టీఆర్ఎస్ నేతల మాటలు నిజం కాదన్నారు. ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఏం మాట్లాడతారో అందరికి తెలుసన్నారు. జీవన్ రెడ్డి స్థాయి- రాజగోపాల్ రెడ్డి స్థాయి ఏంటో ప్రజలను అడుగుదామన్నారు
సీఎం కేసీఆర్ ఆరోగ్యం గురించి తానేమి అనలేదని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఐదు రాష్ట్రాల ఫలితాలు చూసి ముఖ్యమంత్రి షాక్ అయ్యారా? అని మాత్రమే అన్నానన్నారు. ముఖ్యమంత్రి హాస్పిటల్‌కు వెళ్లినట్లు తరువాత చూశానన్నారు. జగదీష్ రెడ్డి సభలో మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఏంటో నల్గొండ ప్రజలకు తెలుసన్నారు. సమైక్య రాష్ట్రంలోనే కాదు.. ఇప్పుడూ తెలంగాణను.. ఆంధ్ర కాంట్రాక్టర్లే దోచుకుంటున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు.

Also Read : రోడ్డు ప్రమాదం లో ఒకరు మృతి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube