ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం కన్నుమూత

ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం కన్నుమూత

0
TMedia (Telugu News) :

ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం కన్నుమూత

టీ మీడియా, ఫిబ్రవరి 4, చెన్నై: ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం (78) ఇకలేరు. శనివారం తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని నుంగమ్‌బక్కమ్‌లోగల హడ్డోస్‌ రోడ్డులోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఇంట్లో జారిపడి ముఖంపై గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయిందని కుటుంబసభ్యులు తెలిపారు. వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి ఇలా మొత్తం 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలను ఆమె ఆలపించారు.కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టిన వాణీజయరాం భారతదేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా గొప్ప నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా ఉత్తమ నేపథ్య గాయని విభాగంలో మూడుసార్లు నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు అందుకున్నారు.

Also Read : టీ మీడియా, ఏ ఐ బి (ఏస్) ఎన్ ఆధ్వర్యం లో..

అంతేగాక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్‌, ఒడిశా తదితర రాష్ట్రాలు కూడా ఆమెను అవార్డులతో సత్కరించాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా వాణీ జయరాంకు పద్మభూషణ్‌ అవార్డును ప్రకటించింది.తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్‌ 30న వాణీ జయరాం జన్మించారు. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఐదో సంతానమై ఆమె 1971లో గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube