కమ్యూనిటీ హాల్ కి స్థలం కేటాయింపు

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 29 వనపర్తి : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శాఖాపూర్ గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వచ్చినప్పుడు ఎస్సీ కాలనీ లో కమ్యూనిటీ హాల్ కొరకు 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి ఆదేశాల మేరకు బుధవారం రోజు మండల గిర్దావర్ సరిత సర్వేయర్ వీఆర్వో ఎస్సీ కాలనీ కి వచ్చి 309 సర్వే నెంబర్ లో నాలుగు గుంటల స్థలాన్ని సర్వే చేసి గ్రామపంచాయతీ సర్పంచ్ మేకల రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో కమిటీ హాల్ నిర్మాణం కొరకు అప్పజెప్పడం జరిగింది. 25 లక్షల రూపాయలతో ఆధునిక హంగులతో నిర్మాణం కొరకు మంత్రి చొరవ తీసుకుని త్వరగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు చొరవ తీసుకున మంత్రికి సర్పంచ్ మేకల రవికుమార్ యాదవ్ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube