సింగిరెడ్డి వాసంతి ఇంటింటి ప్రచారం

మణిగిల్ల గ్రామంలో పలువురి చేరికలు

0
TMedia (Telugu News) :

సింగిరెడ్డి వాసంతి ఇంటింటి ప్రచారం

– మణిగిల్ల గ్రామంలో పలువురి చేరికలు

టీ మీడియా, అక్టోబర్ 31, పెద్దమందడి : మణిగిల్ల గ్రామం లో ఎన్నికల ఇంటింటి ప్రచారంలో స్వయంగా పాల్గొన్న సింగిరెడ్డి వాసంతి. ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీలో పలువురు గ్రామస్తులు చేరారు. సింగిరెడ్డి వాసంతి పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వాళ్ళు బాలురాజ్, శంకర్, మొగిలి, అశోక్ యాదవ్. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారి గురించి సింగిరెడ్డి వాసంతి మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ నాయకత్వం లో బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి యువత బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ జెండా వనపర్తి గడ్డపై ఎగురవేయడం ఖాయమని సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ లో జాయిన్ అయినా వాళ్ళు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపు కు కృషి చేస్తామని సింగిరెడ్డి వాసంతి కి వాగ్దానం చేసారు.

Also Read : ఘనంగా భారత ఉక్కుమనిషి జయంతి వేడుకలు

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంద్ అధ్యక్షులు పి.జగదీశ్వర్ రెడ్డి, మండల రైతు బంద్ అధ్యక్షులు రాజా ప్రకాష్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు పి.విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు విట్ట శ్రీనివాస్ రెడ్డి, మణిగిల్ల ఎంపీటీసీ వరలక్ష్మి శేఖర్ గౌడ్, మణిగిల్ల ఉపసర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు రామిరెడ్డి, మాజీ జడ్పీటీసి కొమ్ము వెంకట్ స్వామి, వెలటూర్ మాజీ ఎంపీటీసీ సి. వెంకటయ్య, మాజీ సర్పంచ్ కొండా రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు చిత్తూరు కృష్ణరెడ్డి(జేసీ ప్రభాకర్ రెడ్డి), గొంది భాస్కర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, బాలరాజు, కొములియా, సి.రాములు, సత్యం సాగర్, ప్రతాపురెడ్డి, సాయికుమార్, ఆనంద్ రెడ్డి, కృష్ణ, తదితరులు పాలుగోన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube