సింగిల్ యూస్ ఆఫ్ ప్లాస్టిక్ నిషేధన కై అవగాహన సదస్సు

సింగిల్ యూస్ ఆఫ్ ప్లాస్టిక్ నిషేధన కై అవగాహన సదస్సు

1
TMedia (Telugu News) :

సింగిల్ యూస్ ఆఫ్ ప్లాస్టిక్ నిషేధన కై అవగాహన సదస్సు

టీ మీడియా, జులై05, రామకృష్ణాపూర్; క్యాతనపల్లి పట్టణంలోని రామకృష్ణాపూర్ గణేష్ మండపం నందు సోమవారం ఏర్పాటు చేసిన సమావేశము లో వర్తక వ్యాపారులకు ,చికెన్, మటన్ ,చేపల దుకాణ యజమానులకు సింగిల్ యూస్ ఆఫ్ ప్లాస్టిక్ నిషేధనకై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటనారాయణ మాట్లాడుతూ 120 మైక్రాన్స్ కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులు ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు పూర్తిగా నిషేధించుటకై ఆదేశాలు జారీ చేశారు.దుకాణాల్లో ఇస్తే 5000, వాడి పడేసే వారికి 500 రూపాయలు జరిమానా విధింపు,వాణిజ్య వ్యాపార సంస్థలలో, దుకాణాలల్లో వస్త్ర సంచులను ప్రోత్సహించుట, పైన తెలిపిన విషయమై పట్టణ ప్రజలు, వివిధ యజమానులు సహకరించి పట్టణ అభివృద్ధికి తోడ్పడగలరని తెలిపారు.

 

Also Read : నల్లమలలో పర్యాటకుల కెమెరాకు చిక్కిన పెద్దపులి

సింగిల్ యూస్ ఆఫ్ ప్లాస్టిక్ వాడడం వలన జరిగే నష్టాలు, వాటి వలన జరిగే దుష్పరిణామాలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్ పర్సన్ అర్రం విద్యాసాగర్ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు, మేనేజర్ కె .నాగరాజు, రెవెన్యూ అధికారి పి కృష్ణ ప్రసాద్, ఇన్చార్జి శానిటైజర్ ఇన్స్పెక్టర్ ఇ. వసంత్,,టీ ఎం సీ ఏ.శ్రీధర్, కార్యాలయ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగినది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube