ఇద్దరు నిరుపేద యువతులవివాహానికి ఆర్థిక సహాయం

ఆపదలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటాం

1
TMedia (Telugu News) :

ఇద్దరు నిరుపేద యువతులవివాహానికి ఆర్థిక సహాయం

– ఆపదలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటాం

– డాక్టర్ రాజా రమేష్ సేవ బృందం, సిరి ఫౌండేషన్
టీ మీడియా, జూన్ 23, రామకృష్ణాపూర్:రామకృష్ణాపూర్ అమరవాది లో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన నల్లతీగల సత్తమ్మ రాజయ్యా ల కుమార్తె దివ్య వివాహానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని సిరి ఫౌండేషన్ సభ్యులను కలవడం జరిగింది.

Also Read : ఆర్థిక సాయం అందించిన కొండా మధు సూధన్ రెడ్డి

సిరి ఫౌండేషన్ సోషల్ మీడియా ద్వారా దాతల దృష్టికి తీసుకెళ్లడంతో రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ రాజా రమేష్ వారి మిత్ర బృందం మానవతా దృక్పథంతో వారి తరపున పదివేల రూపాయలు ,25 కేజీల బియ్యం, సిరి ఫౌండేషన్ సభ్యులు 75 కేజీల బియ్యం, అలాగే నాగార్జున కాలనీలోని మరొక నిరుపేద కుటుంబానికి చెందిన మారుపాక లక్ష్మి సదానందం గారి కూతురి వివాహానికి ఆర్థిక సహాయం డాక్టర్ రాజా రమేష్ వారి మిత్రబృందం ద్వారా ఐదు వేల రూపాయలు ,50 కేజీల బియ్యం, ఆర్థిక సహాయం చేయడంతో కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది .ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజా రమేష్ డాక్టర్ ,వెంకటేష్ ,కడగొండ సాయి కుమార్, సరిగమల తిరుపతి, మేకల రాజయ్య ,బద్రి ,కన్నా, మోహన్, పాల్గొనడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube