100రోజులకు చేరుకున్న సీతమ్మ సాగర్ నిర్వశితుల నిరాహార దీక్షలు .

0
TMedia (Telugu News) :

టీ, మీడియా, అక్టోబర్,22 అశ్వాపురం.

అశ్వాపురం మండలం
అమ్మగారిపల్లి లో భూ నిర్వాసితుల దీక్షలు 100 రోజులకు చేరుకున్నాయి .
దీక్ష లను ప్రారంభించిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య మాట్లాడుతూ
అధైర్య పడొద్దు అండగా ఉంటాం అని హామి ఇచ్చారు.
రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి
ముఖ్యమంత్రి చొరవ చూపి సమస్య పరిష్కరించాలి కోరారు .
దీక్ష లకు సంగిభావం తెలిపిన ప్రతిపక్ష పార్టీ లు ప్రజా సంఘాల నాయకులు
అశ్వాపురం సీతమ్మ సాగర్ భూ నిర్వాసితుల న్యాయమైన కోర్కెలు తీర్చాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య డిమాండ్ చేశారు శుక్రవారం ఉదయం అమ్మగారిపల్లి లోని దీక్ష శిబిరం ను సందర్శించి 100వ రోజు దీక్షలను ప్రారంభించి ప్రసంగించారు.

. ఈ కార్యక్రమం లో సిపిఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్ సిపిఎం జిల్లా నాయకులు అన్నవరపు సత్యనారాయణ టీడీపీ మండల అధ్యక్షులు తుళ్లూరి ప్రకాష్ నాయకులు వెర్పుల మల్లికార్జున్, దంతాల జగదీశ్ ,గద్దల శ్రీను సాంబశివరావు ,సంపత్ లతో పాటు స్థానిక రైతులు నిర్వశితులు పాల్గొన్నారు.

Sitamma sagar Nirvashitu fasting initiations reaching 100days.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube