జర్నలిస్ట్ భవన్ కోసం స్థలం పరిశీలన

జర్నలిస్ట్ భవన్ కోసం స్థలం పరిశీలన

1
TMedia (Telugu News) :

జర్నలిస్ట్ భవన్ కోసం స్థలం పరిశీలన

టీ మీడియా, అక్టోబర్ 19, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమీపం నాగవరం రెవెన్యూ శివారు సర్వేనెంబర్ 91 లో జర్నలిస్ట్ భవన్ నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించిన 10 గుంటల స్థలాన్ని బుధవారం టీయూడబ్ల్యూజే ఐజేయు వనపర్తి జిల్లా అధ్యక్షులు గుండ్రాతి మధుగౌడ్ , తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 143 జిల్లా అధ్యక్షులు పోతుల రాము ఆధ్వర్యంలో యూనియన్ల నాయకులు జర్నలిస్టులు పరిశీలించారు. వనపర్తి తాసిల్దార్ రాజేందర్ గౌడ్ సర్వేయర్ భాస్కర్ స్థలం హద్దులను చూపించారు. యూనియన్లు సంతృప్తి వ్యక్తం చేయడంతో హద్దులకు మార్కింగ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ల అధ్యక్షులు మాట్లాడుతూ భవనం ఏర్పాటు కోసం అవసరమైన స్థలానికి సీసీఎల్ఏ నిర్ణయించిన మార్కెట్ ధరను మంత్రి స్వతహాగా చెల్లించారని వెల్లడించారు.

Also Read : వైయస్సార్ తెలంగాణ మహిళా విభాగం రాష్ట్ర సభ్యురాలిగా లక్ష్మి

అధునాతనంగా అన్ని హంగులతో సుందరమైన భవనాన్ని నిర్మించేందుకు మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముఖ్యమంత్రి నుంచి 25 లక్షల రూపాయలు మంజూరు చేయించారని తెలిపారు. భవన నిర్మాణానికి త్వరలో మంత్రి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. స్థలాన్ని ఇచ్చి భవనానికి అవసరమైన నిధులు మంజూరు చేయించిన మంత్రికి జర్నలిస్టు యూనియన్ల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూ, ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు నోముల రవీందర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బొలెమోని రమేష్, తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ 143 రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బక్షి శ్రీధర్ రావు, టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి. డి. మాధవరావు , నమస్తే తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ చంద్రమౌళి ,మన తెలంగాణ స్టాప్ రిపోర్టర్ రాజు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు అంజి ,సీనియర్ జర్నలిస్టులు పి.ఊషన్న ,పౌర్ణా రెడ్డి, వివిధ పత్రికల జర్నలిస్టులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube