ఇఎస్ఐ అసుపత్రి నిర్మాణం కోసం స్థల పరిశీలన

ఇఎస్ఐ అసుపత్రి నిర్మాణం కోసం స్థల పరిశీలన

1
TMedia (Telugu News) :

ఇఎస్ఐ అసుపత్రి నిర్మాణం కోసం స్థల పరిశీలన

టీ మీడియా,జులై 6, గోదావరిఖని :

రామగుండం కార్మికక్షేత్రంలొ ఎంతొ కాలంగా ఇ.ఎస్.ఐ ఆసుపత్రి కోసం ఎదురుచూస్తుంటె మంగళవారం ఇఎస్ఐ అసుపత్రి నిర్మాణం కోసం స్థలాన్ని ఇఎస్ఐ అధికార బృందం పరిశీలించడం జరిగింది.రామగుండం 20వ డివిజన్ పరిధిలొ గల పాత డంపింగ్ యార్డ్ లొని ఏడు ఎకరాల స్థలంలొ ఐదు ఎకరాలు ఇఎస్ఐ కి కెటాయిస్తు నగర పాలక సంస్థలొ గత సంవత్సరం తీర్మాణం చేస్తు కలెక్టర్ కు సమర్పించడం జరిగింది.ఈ నేపథ్యంలొ ఇఎస్ఐ నోడల్ అధికారి నాగభూషణ రావు,సినీయర్ అసిస్టెంట్ వెంకటేష్,ఇఎస్ఐ సెంట్రల్ రీజనల్ డైరెక్టర్ రేణుక ప్రసాద్,మున్సిపల్ కమీషనర్ సుమన్ రావు, డియంఎచ్ఒ ప్రమోద్ కుమార్,స్టేట్ మెడికల్ ఆఫిసర్ ప్రదీప్,ఇఇ రవికుమార్,స్థానిక ఇఎస్ఐ మెనేజర్ కాగేశ్వర్ రావు, తహశీల్దార్ జహీద్ పాష, సర్వే డిఐ విజయ్ శంకర్, ఆర్ఐ రమ్యశ్రీ,సర్వేయర్ అశోక్,విఅర్ఓ సమ్మయ్య స్థానిక 20వ డివిజన్ కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ లు స్థల పరిశీలన చేయడం జరిగింది.

 

Also Read : స్కానింగ్ సెంటర్ తనిఖీ చేసిన వైద్యాధికారి

ఈ సందర్భంగా కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతు…గత సంవత్సరం క్రితమే ఇఎస్ఐ అసుపత్రి నిర్మాణం కోసం స్థలం కేటాయిస్తు కౌన్సిల్ తీర్మాణం చేయడమైనదని, 20వ డివిజన్ మార్నింగ్ వాక్ కార్యక్రమంలొ ఇక్కడ పర్యటిస్తు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రామగుండం 20వ డివిజన్ లో ఇఎస్ఐ అసుపత్రి నిర్మాణం జరుగుతుందని, ఇక్కడ నిర్మాణం చేయడం రామగుండం తొ పాటు ఇతర దూర ప్రాంతాలన నుండి వచ్చే వారికి రోడ్, రైల్ కనేక్టవిటి ద్వార ఇబ్బంది లేని ప్రయాణం ఉంటుందని,అదే విధంగా రామగుండం పట్టణం అభివృద్దికి తొడ్పడుతుందని చెప్పడంతొ పాటు ఎప్పటికపుడు ఎమ్మెల్యె చందర్,ఇఎస్ఐ శాఖ వారు త్వరగా అసుపత్రి నిర్మాణం కోసం ముందుకు వచ్చెలా కృషి చేస్తున్నారని,ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందరన్న ధన్యవాదాలని, ఇఎస్ఐ అధికార బృందానికి,కమీషనర్, తహశీల్దార్ లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాని అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube