ఆరుగ్యారెంటీలు ప‌క్కా…తొమిందేళ్ల‌లో ఒక్క ద‌ర‌ఖాస్తుకు దిక్కులేదు

ఆరుగ్యారెంటీలు ప‌క్కా…తొమిందేళ్ల‌లో ఒక్క ద‌ర‌ఖాస్తుకు దిక్కులేదు

0
TMedia (Telugu News) :

ఆరుగ్యారెంటీలు ప‌క్కా…తొమిందేళ్ల‌లో ఒక్క ద‌ర‌ఖాస్తుకు దిక్కులేదు

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

టీ మీడియా, డిసెంబర్ 28, హైదరాబాద్ : గతంలో కాంగ్రెస్ పంచిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని, తొమ్మిదేళ్లలో ఒక రేషన్ కార్డుకు దరఖాస్తు తీసుకోలేదని బీఆర్ఎస్ సర్కార్ పై డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ‘ప్రజాపాలన’ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని.. ఇది ప్రజా ప్రభుత్వమని చెప్పారు.ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టి ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించామని చెప్పారు. ప్రజల దగ్గరకు వెళ్లి ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి చేస్తున్న కార్యక్రమమే ‘ప్రజాపాలన’ అని తెలిపారు. కాంగ్రెస్ ది ప్రజల ప్రభుత్వం.. దొరల ప్రభుత్వం కానే కాదని స్పష్టం చేశారు. ప్రజల దగ్గరకే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని వెల్లడించారు. ‘వంద కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం మనది. ప్రజాపాలన అందిస్తామని చెప్పి ప్రజలను ఒప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేశాం.

Also Read : డిఎండికే నేత, నటుడు విజయ్ కాంత్ కన్నుమూత

మేం ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నాం. పదేళ్లలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదు. నేను పాదయాత్ర చేస్తున్న సమయంలో మహిళలు వారి సమస్యలు చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ఉచిత బస్సు అమలు చేశామని వెల్లడించారు. రూ. 10 లక్షలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ ని పెంచామని వివరించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. ఇళ్లు లేనివాళ్లకు, పెన్షన్‌లేని వాళ్లకు, గృహజ్యోతి కింద రావాల్సిన విద్యుత్‌ అన్ని అమలులోకి వస్తాయని చెప్పారు. ఇది ప్రజల ప్రభుత్వం.. మాలాగే ఇచ్చిన హామీలు అమలు కాకుండా ఉంటే బాగుండు అని బీఆర్ఎస్‌ చూస్తుందన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ”పదేళ్లలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదు. తొమ్మిదేళ్లలో ఒక రేషన్‌ కార్డు ఇవ్వలేదు. ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం మాది. ప్రజాపాలన అందిస్తామని చెప్పి ఒప్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. మాది దొరల ప్రభుత్వం కాదు. ఒక వర్గం, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. మేం ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నాం.

Also Read : ప్రజాపాలన సభలు పగడ్బంధీగా నిర్వహించాలి..

మీ దగ్గరకే వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్‌ పెట్టి దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని, సంపదను ప్రజలకు అంకితం చేస్తాం” అని భట్టి వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్‌ గౌతమ్‌, రాష్ట్ర ఉన్నతాధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, హనుమంతరావు, శ్రుతి ఓజా, రాచకొండ సీపీ సుధీర్ బాబు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube