పోలీసులను హతమార్చేందుకు మందుపాతర ఆరుగురు అరెస్ట్

0
TMedia (Telugu News) :

టి మీడియా, డిసెంబర్ 31 వెంకటాపురం:

ములుగు జిల్లా లోని వెంకటాపురం మండలంలో
తిప్పా పురం- పెద్దఉట్లపల్లి అటవీ గ్రామాల మధ్య పోలీసులను హతమార్చేందుకు ఆరుగురు మిలిషియా సభ్యులు మందు పాత్రలను అమరుస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారనీ ఏటూరునాగారం ఎఎస్పీ ఓఎస్డీ శోభన్ కుమార్ శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
సంఘటన స్థలం నుంచి రెండు టిఫిన్ బాక్సులు, కార్డెక్స్ వైరు , రెండు డిటోనేటర్ల స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు మిలీషియా సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు సమావేశంలో సీఐ కె శివప్రసాద్ , ఎస్ ఐ జి తిరుపతి పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube