ఆరవ ద్వాదశ జ్యోతిర్లింగంమాదే అంటూ తగవుపడుతున్న రెండు రాష్ట్రాలు..

ఆరవ ద్వాదశ జ్యోతిర్లింగంమాదే అంటూ తగవుపడుతున్న రెండు రాష్ట్రాలు..

0
TMedia (Telugu News) :

ఆరవ ద్వాదశ జ్యోతిర్లింగంమాదే అంటూ తగవుపడుతున్న రెండు రాష్ట్రాలు..

లహరి, ఫిబ్రవరి 16, మహారాష్ట్ర : శివరాత్రి పండుగ పూట..ఆ శివుడికే తలబొప్పి కట్టే వివాదం రాజుకుంది.. భీమశంకరుడు మావాడంటే మావాడని.. అసోం, మహారాష్ట్ర ప్రభుత్వాలు రచ్చకెక్కాయి.. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఆరవ ద్వాదశ జ్యోతిర్లింగంపైనే ఈ గొడవంతా.. భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోనే ఉందని ఓ వాదన. కాదు అసోం శివుడే భీమశంకరుడని అసోం సీఎం అభిప్రాయం. ఏది నిజం..ఎవరు చెప్పేది వాస్తవం. ఆరవ జ్యోతిర్లింగం తమ రాష్ట్రంలోనే ఉందంటూ అస్సాం ప్రభుత్వం చేసిన ప్రకటనపై మహారాష్ట్ర కారాలు మిరియాలు నూరుతోంది. హిందువులు శివుడిని మూర్తి రూపంతోపాటు లింగరూపంలోను పూజిస్తారు. అయితే మూర్తి రూపంకన్నా లింగ రూపమే ప్రధానమైనదిగా విశ్వసిస్తారు. లింగంలో కైలాసనాథుడి స్వరూపం వెలుగుతుంటుందని భక్తుల నమ్మకం. భూమ్మీద మొత్తం 64 జ్యోతిర్లింగాలు ఉన్నాయని శైవులు విశ్వసిస్తారు. అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పిలువబడే 12 లింగాలు పరమ పవిత్రమైనవిగా భావిస్తారు. వివిధ ప్రదేశాలలో వెలసిన ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒక్కోచోట ఒక్కో పేరుతో పిలుచుకుంటారు. ఇవన్నీ మహాశివుని భిన్న రూపాలుగా భక్తులు కొలుస్తారు. మల్లికార్జునుడు(శ్రీశైల క్షేత్రం), సోమనాథేశ్వరుడు(గిర్, గుజరాత్), మహాకాళేశ్వరుడు (ఉజ్జయిన్, యుపి), ఓంకారేశ్వరుడు (మధ్యప్రదేశ్), కేదార్‌నాథ్(ఉత్తరాఖండ్), భీమశంకరం(పుణె, మహారాష్ట్ర), కాశీ విశ్వనాథుడు(వారణాసి, యుపి), త్రయంబకేశ్వర్(నాసిక్, మహారాష్ట్ర), బైద్యనాథ్(దేవ్‌ఘర్, జార్ఖండ్), నాగేశ్వర(వ్వారక, గుజరాత్), రామనాథస్వామి(రామేశ్వరం), ఘృష్ణేశ్వర్ (ఔరంగాబాద్, మహారాష్ట్ర) ఉన్నాయి.

Also Read : కాళేశ్వర క్షేత్రంలో మూడు రోజులు శివరాత్రి ఉత్సవాలు

కాకపోతే..మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా గువాహటిలోని పమోహి వద్ద డాకిని పర్వతాలపై వెలసిన భీమశంకర జ్యోతిర్లింగాన్ని భక్తులు సందర్శించాలని ఆహ్వానిస్తూ అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ యాడ్స్ ఇచ్చారు..మహారాష్ట్రలోని కొన్ని పత్రికల్లో సైతం ఈ ప్రకటనలు కనిపించాయి. ఇదే వివాదానికి కారణం.. ఈయాడ్స్‌పై మహారాష్ట్రలోని శివ భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube