వృత్తి నైపుణ్యాలు పెంపోందించుకోవాలి
టీ మీడియా, మార్చి 10, బుగ్గారం :
జగిత్యాల జిల్లాలోని బుగ్గారం మండల కేంద్రంలో గల స్థానిక పాఠశాలలో, పాఠశాల సముదాయ సమావేశాల ద్వారా ఉపాధ్యాయులు లు వృత్తి నైపుణ్యాలు, పెంపోందించుకోవాలని మండల విద్యాధికారి బత్తుల భూమయ్య పేర్కొన్నారు. గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండవ రోజు పాఠశాల సముదాయ సమావేశాలు నిర్వహించారు. ప్రాథమిక స్థాయిలో బోధించే 50 శాతం ఉపాధ్యాయులకు, ప్రాథమికోన్నత స్థాయిలో గణితం, సాంఘిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం బోధించే ఉపాధ్యాయులకు సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ పాఠశాలల్లో రీడ్ కార్యక్రమం, మూలాల్లోకి వెళ్దాం కార్యక్రమాన్ని, పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. సురక్షిత పాఠశాల, స్వచ్ఛ పాఠశాల, స్వచ్చత క్లబ్ ల ఏర్పాటు, ఎక్ భారత్ శ్రేష్ట్ భారత్, బడి బయట పిల్లల స్థితి వంటి అంశాలపై అవగాహన కలిగించారు. ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాల గంగాధర్, హరి కిరణ్, రవీంద్రనాథ్, రఘుపతి, రాజేశం, గంగయ్య, శ్రీధర్, ఆంజనేయులు, రాజేష్, వివేక్, సిఆర్పి పురుషోత్తం తదితరులు పాలుగోన్నట్టు మీడియా సమావేశంలో తెలిపారు.
Also Read : రాఘవ కు షరతులతో బెయిల్
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube